జనవరి నుంచి తరగతులు
సాక్షి, హైదరాబాద్: డైట్‌సెట్ ప్రవేశాల అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. తెలంగాణలోని డైట్ కళాశాలలకు అగ్నిమాపక శాఖ జారీ చేసే నిరభ్యంతర (ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీ) పత్రాలు లేకపోయినా గుర్తింపును పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో ఫైర్‌సేఫ్టీ పత్రాలు లేకపోతే కౌన్సెలింగ్ నిర్వహించలేమని డైట్ కన్వీనర్ పేర్కొన్నారు. అయితే ఆ కళాశాలల నుంచి కౌన్సెలింగ్ సమయంలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్‌వోసీలు స్వీకరించాలని తాజా నిర్ణయించారు. దీంతో కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది.
ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖలు తమ పరిధిలోని డైట్ కళాశాలల జాబితాలను సమర్పించడంతో.. కౌన్సెలింగ్ చేపట్టేందుకు డైట్‌సెట్ యం త్రాంగం కసరత్తు చేస్తోంది. తెలంగాణలోని 253, ఏపీలోని 413 డైట్ కళాశాలల్లో ఉమ్మడి ప్రవేశాల కోసం ఈ నెల 12వ తేదీన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఒకవేళ ఆలస్యమైతే 15 లేద 16వ తేదీన షెడ్యూల్ ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు. షెడ్యూల్ వెలువడిన అనంతరం అందులో ప్రకటించిన తేదీ నుంచి విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఆప్షన్లు స్వీకరించి, ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన 15 రోజుల్లోగా కళాశాలల్లో తరగతులను ప్రారంభిస్తారు. మొత్తంగా వచ్చే ఏడాది జనవరి మొదటివారంలో తరగతులు ప్రారంభమవుతాయని డైట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి తెలిపారు.
12న డైట్ కౌన్సెలింగ్ షెడ్యూల్?
Published Mon, Dec 8 2014 6:11 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement