మురళీనగర్: ఎంసెట్ ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఈసారి మంచి స్పందన లభించింది
మురళీనగర్: ఎంసెట్ ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఈసారి మంచి స్పందన లభించింది. నగరంలోని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో శనివారం ప్రారంభమైన కౌన్సెలింగ్‌లో ఇప్పటివరకు రిజిస్టరు చేసుకోని అభ్యర్థుల్లో 224మంది హాజరై పేర్లు నమోదు చేసుకుని వెంటనే వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలో 161మంది, కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీలో 63మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఆదివారంతో రెండో దశ కౌన్సెలింగ్ ముగుస్తుంది. ఈలోగా అన్ని ర్యాంకుల వారు మెరుగైన అవకాశాల కోసం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. సీట్ల కేటాయింపు ఫలితాలు ఈనెల 26న వెలువడతాయి.