
సాక్షి,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గంజాయి వినియోగం విస్తరిస్తోందని ఎసిపి గౌస్‌భాష పేర్కొన్నారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, మందమర్రి, హాజీపూర్, శ్రీరాంపూర్లలో గంజాయి వినియోగం జోరుగా కొనసాగుతుంది. తాజాగా హాజీపూర్ మండలం రాపల్లిలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎసిపి గౌస్‌భాష వెల్లడించారు. విచారణలో భాగంగా మరికొంత మంది గంజాయికి బానిసలు అవుతున్నట్లు తెలుసుకొని మరో 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారందరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించిన గౌస్‌భాష మరోసారి గంజాయి జోలికి పోకూడదంటూ ప్రమాణం చేయించారు. కాగా, వారం క్రితమే మంచిర్యాల జిల్లా మందమర్రిలో గంజాయికి బానిసలుగా మారిన 39 మందికి వారి తల్లిదండ్రుల సమక్షంలో డిసిపి రక్షిత్ కె మూర్తి కౌన్సెలింగ్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment