ఈనెల 12వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశాయి.
► మొదటి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్!
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లకు యూని వర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపు వచ్చినా, రాకున్నా అందుబాటులో ఉన్న సీట్లతో మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఈ నెల 12 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యూనివర్సిటీలు అన్ని ఇంజనీరింగ్ కాలే జీల్లోని అన్ని సీట్లకు అఫిలియేషన్లు ఇవ్వకపోయినా ఇప్పటివరకు క్లియరెన్స్ వచ్చి న సీట్లతో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది.
వాస్త వానికి ఈనెల 10వ తేదీలోగా ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయాలు (జేఎన్‌టీయూహెచ్) తమ పరిధిలోని కాలేజీలకు అనుబంధ గుర్తింపు, సీట్లలో ప్రవేశాలకు అనుమతి ఇస్తామని ఇదివరకే ఉన్నత విద్యా మండలికి తెలియజేశాయి. కానీ ఇంతవరకు జేఎన్‌టీయూహెచ్ నుంచి అనుబంధ గుర్తింపునకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదు. అయినా ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి, సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టాయి.
ఈనెల 12వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశాయి. ఇప్పటివరకు జేఎన్‌టీయూహెచ్ తమ పరిధిలోని కాలేజీల్లో 55 వేల సీట్లలో ప్రవేశాలకు అంగీకరించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో మరో 10 వేల సీట్లకు శుక్ర, శనివారాల్లో అనుబంధ గుర్తింపు జాబితా ఇచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో మరో 3 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇలా మొత్తంగా మొదటి విడత కౌన్సెలింగ్‌లో 68 వేల సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.