భాషా పండిట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 26, 27, 28 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎల్‌పీ సెట్-2015 కన్వీనర్ వీఎస్ భార్గవ తెలిపారు.
గుంటూరు: భాషా పండిట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 26, 27, 28 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎల్‌పీ సెట్-2015 కన్వీనర్ వీఎస్ భార్గవ తెలిపారు.
సెప్టెంబర్ 16న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎల్‌పీ సెట్-2015 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2015-16 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు తెలుగు, హిందీ భాషా పండిట్ శిక్షణ సంస్థల్లో ప్రవేశానికి చేపడుతున్న వెబ్ కౌన్సెలింగ్‌కు ఆయా అభ్యర్థులు WWW.lpcetap.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఈనెల 26,27,28 తేదీల్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఇచ్చుకున్న అభ్యర్థులకు సీటు కేటాయించిన కళాశాల జాబితా ఈనెల 30న తిరిగి అదే వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని వివరించారు. సదరు అభ్యర్థులు తమ ఉత్తీర్ణత ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ఈనెల 31న హాజరు కావాలని సూచించారు.