మూడేళ్లుగా ఎందుకు నిర్వహించడం లేదు?
ఎల్పీసెట్పై ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: భాషా పండితుల (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ) ప్రవేశాలకు సం బంధించి ఎల్పీ సెట్ మూడేళ్లుగా ఎందుకు నిర్వహించడం లేదని ఉమ్మడి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. మూడేళ్లుగా ఎల్పీ సెట్ నిర్వహిం చకపోవడాన్ని సవాలు చేస్తూ నగరానికి చెందిన బాల్రాజ్, మరో ఏడుగురు వేసిన పిటిషన్పై జస్టిస్ కోదండరామ్ గురువారం విచారణ జరిపారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది అర్జున్ వాదనలు వినిపిస్తూ, ఎల్పీ సెట్ నిర్వహించకపోవడం వల్ల పిటి షనర్లు భాషా పండితుల కోర్సు పూర్తి చేయలేకపోతున్నారన్నారు. బీఏ (తెలుగు) పూర్తిచేసిన వారికి బీఈడీ చేసే అర్హత లేదని, భాషా పండిత ట్రైనింగ్ కోర్సు చేయాల్సి ఉంటుందని, ఇందులో ప్రవేశానికి ఎల్పీ సెట్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. తద్వారానే ప్రవేశాలు కల్పించాలని ఉత్త ర్వులు చెబుతున్నాయన్నారు.