విశాఖ: ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి కౌన్సిలింగ్ ను శుక్రవారం విశాఖపట్నంలో ఏపీ విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. కౌన్సిలింగ్ కు 34 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది 6 వేల ఇంజనీరింగ్ సీట్లు తగ్గంచినట్టు గంటా తెలిపారు. అదేవిధంగా 5 ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేసామన్నారు. హైదరాబాద్ లోని టెక్నికల్ భవనం మూసివేయడంతో అక్కడ కౌన్సిలింగ్ నిర్వహించలేకపోయామని గంటా తెలిపారు.
తొలి విడత కౌన్సిలింగ్ లో భాగంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు ర్యాంకుల వారీగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. జూన్ 14 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. జూన్ 22, 23 తేదీల్లో ఆప్షన్లను మార్చుకొనే అవకాశం ఉంది. జూన్ 26 న సీట్లను అలాట్ చేయనున్నారు.
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
Published Fri, Jun 12 2015 10:17 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement