ఎంసెట్ కౌన్సెలింగ్ కేసు ఆగస్టు 4కి వాయిదా
న్యూఢిల్లీ: ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహణ గడువును పొడిగించాలని వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థులు నష్టపోకుండా తక్షణమే కౌన్సెలింగ్ జరపాలని ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 10 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏఐసీటీఈ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్ర విభజన జరిగి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నేపథ్యంలో యంత్రాంగం పూర్తిస్థాయిలో సమాయత్తంగా లేదని, ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహణ గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.