కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) : బయోటెక్నాలజీ, బి.ఫార్మాసీ, ఫార్మడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఎస్‌జీపీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు కో– ఆర్డినేటర్ వై.విజయభాస్కర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంసెట్–2016 బైపీసీ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చన్నారు. కళాశాలలకు ఆప్షన్లను 19 నుంచి 21వ తేదీ వరకు ఇచ్చుకోవచ్చని, 23వ తేదీన కళాశాలల కేటాయింపు జరుగుతుందని వివరించారు.
ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని,అర్హత ఉన్న అభ్యర్థులు ఎంసెట్ హాల్ టిక్కెట్, ఎంసెట్ ర్యాంకు కార్డు, పది, ఇంటర్ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ సర్టిఫికెట్లను ఒరిజినల్‌తోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తెచ్చుకోవాలన్నారు. కౌనెల్సింగ్ నమోదు ఫీజుగా ఎస్సీ ఎస్టీలు రూ. 500, బీసీలు/ఓసీలు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎన్‌సీసీ/పీహెచ్/క్యాప్/స్పోర్ట్స్ కేటగిరి అభ్యర్థులకు విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్సైట్ను సంప్రదించవచ్చన్నారు.
ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు 18 నుంచి కౌన్సెలింగ్
Published Sat, Jul 16 2016 7:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement
Advertisement