ఐఐటీ మద్రాసు వెబ్ సైట్ హ్యాక్
ఐఐటీ మద్రాసు వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేశారు. ఇనిస్టిట్యూట్ వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు అందులో పాకిస్తాన్ నినాదాలను పోస్టు చేశారు. సంస్ధ వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన విద్యార్ధులు హ్యాకర్ల రాతలను చూసి షాక్ కు గురయ్యారు. ఫైజల్1337ఎక్స్ అనే హ్యాకర్ ఈ పనికి పాల్పడినట్లు భావిస్తున్నారు. పాకిస్తాన్ హ్యాకర్స్ శక్తిని మీరు ఇంకా రుచి చూడలేదంటూ ఫైజల్1337ఎక్స్ వ్యాఖ్యానాలు చేశాడు.
వెబ్‌సైట్ హ్యాక్ అయిన విషయాన్ని కొందరు విద్యార్ధులు తన దృష్టికి తీసుకువచ్చారని ఐఐటీ మద్రాస్ అధికార ప్రతినిధి వెంకట్రామన్ మీడియాతో తెలిపారు. కొద్ది సేపటి తర్వాత వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు.