గర్భంలోని పిండం వయసును అత్యంత కచ్చితత్వంతో లెక్కింటే ఒక కృత్రిమ మేధ (ఏఐ) పరికరాన్ని ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఇది నిర్దిష్టంగా భారతీయ అవసరాలకు ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఇది మూడు నెలలు పైబడిన పిండం వయసును లెక్కించడానికి సాయపడుతుంది.
పరిశోధనలో ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్(టీహెచ్‌ఎస్‌టీఐ) పరిశోధకులు కూడా భాగస్వాములయ్యారు. పిండం వయసును కచ్చితత్వంతో నిర్ధారించడం చాలా అవసరం. దానివల్ల గర్భిణికి సరైన సంరక్షణ అందించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే కాన్పు తేదీని కూడా నిర్దిష్టంగా అంచనా వేయవచ్చు.
తాజా ఏఐ పరికరానికి ‘గర్భిణి-జీఏ2’ అని పేరు పెట్టారు. భారతీయ జనాభా డేటాను ఉపయోగించి రూపొందిన తొలి ఏఐ సాధనం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం పశ్చిమ దేశాల జనాభా కోసం రూపొందించిన ఒక సూత్రం ఆధారంగా పిండం వయసును లెక్కిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రైవేట్ వైద్యం.. ఛార్జీలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు
మూడు నెలలు నిండాక దీన్ని వర్తింపజేస్తే.. ఫలితంలో తప్పు రావొచ్చు. భారతీయ జనాభాలో పిండం ఎదుగుదలలో ఉన్న వైరుధ్యాలే ఇందుకు కారణం. ‘గర్భిణి-జీఏ2’తో ఈ ఇబ్బందిని అధిగమించొచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. తద్వారా భారత్‌లో మాతా శిశు మరణాల రేటు తగ్గుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment