సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసులో జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేశంలోనే అతి పెద్ద విద్యార్థి ఉత్సవంగా టెక్ ఫెస్టివల్స్‌లో ఒకటైన శాస్త్‌త్ర 26వ ఎడిషన్ నిర్వహించనున్నారు. 80 ఈవెంట్‌లు, 130 స్టాల్స్‌తో జరగనున్న ఈ కార్యక్రమానికి 70,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా విద్యార్థులచే నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్‌కు చెందిన 750 మంది విద్యార్థులు వివిధ సంస్థాగత సేవలో పనిచేయనున్నారు. సోమవారం క్యాంపస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శాస్త్ర 2025 గురించి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ శ్ఙ్రీశాస్త్ర వంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో నిర్వహణ నైపుణ్యాలు, నిబద్ధత, బాధ్యత వంటి విలువైన లక్షణాలను పెంపొందించేందుకు వలుందన్నారు.
ఒక సాధారణ ప్రయోజనం కోసం పెద్ద బృందాలలో పని చేసే సామర్థ్యంతో పాటూ ఐఐటీ మద్రాస్ విద్యార్థులు అనేక ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యక్తులను ఈవెంట్‌కు ఆహ్వానించే అవకాశం విద్యార్థులకు దక్కినట్లయ్యిందన్నారు. శాస్త్ర 2025కు సహకారంగా ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ రామకృష్ణన్ మాట్లాడుతూ, వాస్తవ–ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి, ఆవిష్కరణ , ప్రోత్సాహం, సహకారం, అకాడెమియా నైపుణ్యాలు, జ్ఞానమార్పిడికి ఓ ప్రత్యేక వేదికగా శాస్త్ర నిలవబోతోందన్నారు.
వివిధ ఈవెంట్‌లు..
ఏఐ రోబోటిక్స్, స్థిరమైన సముద్ర సాంకేతికతలు వంటి అత్యాధునిక రంగాలలో సహకార పరిశోధన, నైపుణ్య అభివృద్ధికి దోహదకరంగా నిలవనున్నట్లు వివరించారు. శాస్త్ర వంటి ప్రధానమైన సాంకేతిక ఈవెంట్‌తో భారతదేశ సాంకేతిక, శాసీ్త్రయ సామర్థ్యాలను పెంపొందించే స్టీమ్ కెరీర్‌లను ప్రోత్సహిస్తూ స్థిరమైన సముద్ర అన్వేషణ, వాతావరణ స్థితిస్థాపకత కోసం పరిష్కారాలను అన్వేషించడానికి, తరువాతి తరాన్ని ప్రేరేపించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. అటానమస్ డ్రోన్ డెలివరీని కలిగి ఉండే శాస్త్ర ఏరియల్ రోబోటిక్స్ ఛాలెంజ్ ఇందులో కీలకం కానున్నట్టు పేర్కొన్నారు.
డ్రోన్‌లు తమ ప్రోగ్రామింగ్, సెన్సార్ సామర్థ్యాలను ప్రదర్శిస్తూ, లక్ష్యాన్ని గుర్తించడానికి స్వయం ప్రతిపత్తితో నావిగేట్ చేస్తాయన్నారు. అలాగే రోబో స్కోర్ ఈవెంట్, ఆల్గో ట్రేడింగ్, పెట్రి–డిష్ ఛాలెంజ్ వంటి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రయోజనకరం కానున్నట్లు వివరించారు. ఐఐటీ మద్రాస్ డీన్ (విద్యార్థులు) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్. గుమ్మడి మాట్లాడుతూ శాస్త్ర సమ్మిట్, రీసెర్చ్ కాన్ఫరెన్స్‌లో రెండు కొత్త అంశాలను పరిచయం చేయబోతున్నామన్నారు. ఇందులో ఒకటి ఫ్యూచర్ సిటీస్ మరొకటి స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ అని వివరించారు.
ఐఐటీ మద్రాస్‌లోని సహ–కరిక్యులర్ అడ్వైజర్ డాక్టర్ మురుగయన్ అమృతలింగం, మాట్లాడుతూ వార్షిక టెక్నికల్ ఈవెంట్ అయిన శాస్త్ర విద్యార్థులచే నిర్వహించే టెక్నో–మేనేజిరియల్ పండుగలలో ఒకటిగా పేర్కొన్నారు. ఈ 26వ వార్షిక కార్యక్రమం బహుళ సాంకేతిక , వ్యాపార డొమైనన్‌లలో విభిన్నమైన ఈవెంట్‌లు, వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలతో పాటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్, అటానమస్ రోవర్ ఛాలెంజ్‌లు, సాయుధ దళాల ప్రదర్శనలు, రోబోట్ యుద్ధాలు, ఇతర ప్రాంతాలలో వర్క్‌షాప్‌ల నిర్వహణకు కూడా వేదికగా నిలవనున్నట్టు తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యా ర్థులు, టెక్నో ఔత్సాహికులు తరలిరావాలని ఆహ్వానించారు.
సహ–కరిక్యులర్ అఫైర్స్ సెక్రటరీ సుఖేత్ కల్లుపల్లి మాట్లాడుతూ ఇది సాంకేతిక ఆవిష్కరణల వేడుక అని, ఇన్‌స్టిట్యూట్ ఓపెన్ హౌస్ సందర్భంగా ఐఐటీ మద్రా స్‌లోని ల్యాబ్‌లు, సెంటర్‌లను రెండు రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ఒక అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నంబి నారాయణన్ , గణిత శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్‌సుజాత రామదురై, రుచిరా వంటి వారు ఈ వేడుకలో ప్రత్యేక ప్రసంగం చేయబోతున్నారని వివరించారు. ఈ సమావేశంలో స్టూడెంట్ కోర్ సుధన్, అనుమల సాథ్విక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment