గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా
వేలూరు: చెరుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ఆదుకోవాలని కోరుతూ తమిళనాడు చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో కాట్పాడిలోని ప్రభుత్వ షుగర్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేసి, నిరసన తెలిపారు. ఈ ధర్నాకు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి మణి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరుకు రైతులకు ఎకరా చెరుకు విత్తనానికి రూ.15 వేలు సబ్సిడీ ఇవ్వాలని, అలాగే ఫ్యాక్టరీ పంపే ఒక టన్ను చెరుకు ధర రూ.5,500 ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు అనేక కష్టాలు పడి ఫ్యాక్టరీలకు చెరుకును పంపితే బిల్లులు ఇవ్వడంలో అధికారులు కాలయాపన చేస్తున్నారని, వెంటనే బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి, వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించేలా చూడాలన్నారు. ఈ ధర్నాలో ఆ సంఘం రెతు నాయకులు మణి, కన్నయ్యనాయుడు, రంగనాధన్, బాల వినాయకం రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment