దీక్షిత్ శెట్టి కోలీవుడ్ ఎంట్రీ
తమిళసినిమా: కన్నడం, తెలుగు భాషల్లో నటిగా మంచి గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి తాజాగా కోలీవుడ్‌లో కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈయన ఇంతకుముందు తెలుగులో నాని కథానాయకుడిగా నటించిన దసరా చిత్రంలో ముఖ్యపాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే కన్నడంలో ఫినిక్ తదితర ప్రాంతాల్లో నటించారు. కాగా ఇప్పుడు తమిళంలో శ్రీసరవణ ఫిలిం ఆర్ట్స్ పతాకంపై జీ.సరవణన్ నిర్మిస్తున్న చిత్రం ద్వారా కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బిగ్‌బాస్ రియాల్టీ గేమ్ షో ఫేమ్ అయినా జీనత్ కథానాయకిగా పరిచయం అవుతున్నారు. సారా కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పుడు భాషా భేదం లేకుండా దక్షిణాదిని దాటి పాన్ ఇండియా చిత్రాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. మలేషియాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న కథా చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్రం షూటింగ్‌ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ చిత్రం కోసం నటుడు దీక్షిత్ శెట్టి తన పాత్ర కోసం మేకోవర్ అయ్యి నటిస్తున్నట్లు చెప్పారు. దీనికి వెంకీ సూరినేని ,ఆయాగ్రహణం అందిస్తున్నారని, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment