రాష్ట్ర ప్రజల సంక్షేమమే డీఎంకే ధ్యేయం
మంత్రి దురై మురుగన్
వేలూరు: రాష్ట్ర ప్రజల సంక్షేమమే డీఎంకే ధ్యేయమని రాష్ట్ర సీనియర్ మంత్రి దురై మురుగన్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ 72వ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకుని వేలూరు జిల్లా అనకట్టు నియోజక వర్గంలోని గంగనెల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే నందకుమార్ సొంత నిధులతో జిల్లాలోని 1,072 మంది గర్భిణులకు సీమంతం సామగ్రి పంపిణీ, అన్నదానం, సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీ కుటుంబంలో మీకు సీమంతం చేశారో లేదో తనకు తెలియదు గానీ మీ అన్నగా మీ కుటుంబంలో ఒక తమ్ముడిగా, నాన్నగా ఎమ్మెల్యే నందకుమార్ ఇంత మందికి సీమంతం చేయడంతో పాటువస్త్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి సహాయకాలు దేశంలో ఎవరూ చేయబోరని, ఇది డీఎంకేలోని ప్రజా ప్రతినిధులతోనే సాధ్యమన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని మీరు సరైన సమయంలో వైద్యపరీక్షలు చేసుకుని ఈ సమాజానికి ఉపయోగ పడేలా పురిటిబిడ్డను ప్రసవించాలని, ఆరోగ్యంగా పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కార్తికేయన్, అములు, మేయర్ సుజాత, జెడ్పీ చైర్మన్ బాబు, మాజీ ఎంపీ మహ్మద్ సఖీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment