‘ఫిడే’ విజేతకు ప్రోత్సాహం
సాక్షి, చైన్నె: ఫిడే ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్‌లో విజయం సాధించిన తమిళనాడుకు చెందిన చదరంగం ఆటగాడు ప్రణవ్ వెంకటేషన్‌కు నగదు ప్రోత్సాహాన్ని సీఎం స్టాలిన్ ప్రకటించారు. గురువారం సచివాలయంలో ఆ క్రీడాకారుడ్ని సత్కరించి రూ. 20 లక్షలు చెక్కును అందజేశారు. విద్య, క్రీడలపరంగా తమిళనాడును అత్యుత్తమ రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. క్రీడాకారులను ప్రోత్సహించేలా పలు పథకాలను అమలు చేస్తున్నారు. క్రీడల్లో పతకాలను సాధించిన వారికి నగదు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇందులో భాగంగా గత నెల జరిగిన ఫిడే ప్రపంచ జూనియర్ చాంపియన్ షిఫ్ టోర్నమెంట్‌లో తమిళనాడుకు చెందిన ప్రణవ్ వెంకటేష్ విజయకేతనం ఎగురవేశాడు. చైన్నెకు చేరుకున్న ప్రణవ్ గురువా రం సచివాలయంలో సీఎం స్టాలిన్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. తాను సాధించిన పతకాన్ని సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రణవ్‌ను సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌లు సత్కరించారు. ప్రణవ్‌ను మరింత ప్రోత్సహించే విధంగా రూ. 20 లక్షలు నగదు ప్రోత్సాహానికి గా ను చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ మురుగానందం, క్రీడలశాఖ కార్యదర్శి అతుల్య మి శ్రా, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ, సభ్య కార్యదర్శి జె. మేఘనాథరెడ్డి పాల్గొన్నారు. ముందుగా సీఎం స్టాలిన్‌తో ఎంఎస్ స్వా మినాథన్ పరిశోధన సంస్థ అధ్యక్షురాలు, శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ భేటీ అయ్యారు. చైన్నె రామాపురంలో తన తండ్రి హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ పేరిట పార్కు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
రూ.20 లక్షల నజరానా
‘ఫిడే’ విజేతకు ప్రోత్సాహం
Comments
Please login to add a commentAdd a comment