
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్‌ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జిమ్నాస్ట్ అక్షితి మిశ్రా అదరగొట్టింది. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోన్న అక్షితి ఈ టోర్నీలో 3 పసిడి పతకాలు, 2 రజత పతకాలను హస్తగతం చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖేల్ గాన్ పబ్లిక్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ పోటీల్లో అక్షితి పాల్గొన్న నాలుగు విభాగాల్లోనూ పతకాలను కైవసం చేసుకుంది.
బ్యాలెన్సింగ్ బీమ్ ఈవెంట్‌లో ఆమె విజేతగా నిలిచి స్వర్ణాన్ని గెలుచుకోగా... మేఘాన్షి, కోమల్ వరుసగా రజత, కాంస్య పతకాలను అందుకున్నారు. ఫ్లోర్ ఎక్స్‌ర్‌సైజ్ ఈవెంట్‌లోనూ అక్షితి స్వర్ణంతో మెరిసింది. టేబుల్ వాల్ట్, అన్‌ఈవెన్ బార్స్ ఈవెంట్‌లలో రెండో స్థానంలో నిలిచి రెండు రజత పతకాలను నెగ్గింది. వీటితో పాటు టోరీ్నలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 36.95 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఆమె ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి మరో బంగారు పతకాన్ని గెలుచుకుంది.