భారత బ్యాడ్మింటన్ బృందం 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా గెలవలేకపోయింది. లక్ష్య సేన్ పతకం దగ్గరికి వచ్చినప్పటికీ లీ జి జియాతో జరిగిన కాంస్య పతక పోరులో ఓటమిపాలయ్యాడు. భారత షట్లర్ల పేలవ ప్రదర్శన పట్ల బ్యాడ్మింటన్ కోచ్ ప్రకాష్ పదుకొణే తీవ్ర నిరాశకు గురయ్యాడు. భారత షటర్ల ఆటతీరును బహిరంగంగా దుయ్యబట్టాడు. ప్రకాశ్ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. అశ్విని పొన్నప్ప ఆవేశపూరిత సమాధానంతో ముందుకు వచ్చారు. అయితే ప్రకాశ్ పదుకొణెకు భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు.
స్పోర్ట్‌స్టార్ కోసం రాసిన కాలమ్‌లో గవాస్కర్ ఇలా రాసుకొచ్చాడు. సాకులు చెప్పడం మన ఆటగాళ్లకు అలవాటుగా మారిందని అర్దం వచ్చేలా కామెంట్స్ చేశాడు. సాకులు చెప్పడంలో మన దేశం (షట్లర్లను ఉద్దేశిస్తూ) బంగారు పతకాలు సాధిస్తుంది ఎద్దేవా చేశాడు. ప్రకాశ్ బాధలో నిజాయితీ ఉందని, ఇందులో అతన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని అన్నాడు. ఆటగాళ్లకు ప్రభుత్వం నుంచి చాలా మద్దతు ఉందని, ఓటములకు ఆటగాళ్లు బాధ్యత వహించాలని ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా, ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత షట్లర్ల శిక్షణ నిమిత్తం కోట్ల రూపాయల ఖర్చు చేశారన్న అంశంపై ప్రస్తుతం క్రీడా వర్గాల్లో దూమారం రేగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment