Samantha: హార్ట్‌ బ్రేక్‌ అయింది.. సమంత పోస్ట్‌ వైరల్‌ | Samantha Reacts As Vinesh Phogat Announces Retirement | Sakshi
Sakshi News home page

Samantha: హార్ట్‌ బ్రేక్‌ అయింది.. సమంత పోస్ట్‌ వైరల్‌

Aug 8 2024 3:12 PM | Updated on Aug 8 2024 3:24 PM

Samantha Reacts As Vinesh Phogat Announces Retirement

భారత ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌ బౌట్‌కు కొన్ని గంటల ముందు అధిక బరువు కారణంగా వినేశ్ ఫొగాట్‌ను అనర్హురాలిగా ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది గంటలకే వినేశ్ రిటైర్‌మెంట్ తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. యావత్‌ భారత్‌ ఆమెకు మద్దతు తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాజకీయ, సినీ, క్రిడా ప్రముఖులు ఆమెకు తోడుగా నిలుస్తున్నారు. బంగారు పతకం సాధించకపోయినా.. మా దృష్టిలో నువ్వే అసలైన విజేతవని కొనియాడుతున్నారు.

(చదవండి: నాగచైతన్య- శోభితా ధూళిపాళ్లను ఆశీర్వదించండి: నాగార్జున)

ఇక టాలీవుడ్‌ ప్రముఖులు సైతం వినేశ్‌కి అండగా నిలుస్తున్నారు. అనర్హత వేటుకు గురైన విషయం తెలియగానే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఇన్‌స్టా వేదికగా వినేశ్‌కి ధైర్యం చెప్పింది. ‘కొన్నిసార్లు, పోరాడే వ్యక్తులు చాలా కష్టతరమైన అడ్డంకులను ఎదుర్కొంటారు. మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి, మరింత శక్తితో తిరిగొస్తారు. మీ అద్భుతమైన సామర్థ్యంతో ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఇలా నిలదొక్కుకోవడం నిజంగా మెచ్చుకోదగినది.' అని సమంత రాసుకొచ్చింది. ఇక రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసి సమంత మరింత బాధ పడినట్లు తెలుస్తోంది. హర్ట్‌ బ్రేక్‌ సింబల్‌తో ఆమె రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలియజేసింది. ప్రస్తుతం సమంత పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement