అఫ్గానిస్తాన్ బ్రేక్ డ్యాన్స్ క్రీడాకారిణిపై వేటు
పారిస్: ఒలింపిక్స్ క్రీడల ‘బ్రేకింగ్’ (బ్రేక్ డ్యాన్స్) ఈవెంట్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ ప్లేయర్ ఇండియా సర్జో, ఐఓసీ శరణార్ధి టీమ్‌కు చెందిన మనీజా తలాష్ మధ్య ప్రి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ఈ పోరు కొనసాగుతున్న సమయంలో మనీజా అఫ్గనిస్తాన్‌లోని మహిళలను స్వేచ్ఛను ప్రసాదించమంటూ ‘ఫ్రీ అఫ్గాన్ ఉమెన్’ అంటూ రాసి ఉన్న కేప్‌ను తన డ్రెస్‌పై ధరించి డ్యాన్సింగ్ చేసింది.
అయితే రాజకీయపరమైన వ్యాఖ్యలు, నినాదాలు ప్రదర్శించడంపై ఒలింపిక్స్‌లో నిషేధం ఉంది. దాంతో వెంటనే పోటీని నిలిపివేసిన అధికారులు ఆమెను డిస్‌క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించారు. మనీజా స్వదేశం అఫ్గానిస్తాన్ కాగా... ఆ దేశం తాలిబాన్ల ఆ«దీనంలోకి వచ్చిన తర్వాత అఫ్గాన్ నుంచి పారిపోయి స్పెయిన్‌లో శరణార్థిగా తలదాచుకుంది.
క్రీడల్లో కల నెరవేర్చుకునేందుకు వచ్చానంటూ 21 ఏళ్ల మనీజా తన గురించి చెప్పుకుంది. ఇప్పుడు శరణార్ధి జట్టు ద్వారా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం రాగా, బరిలోకి దిగి తమ మహిళల గురించి ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆమె చేసిన పనికి ఒలింపిక్స్‌లో అనర్హత వేటును ఎదుర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment