వినేశ్‌కు రూ. 16 కోట్ల నజరానాలు?.. చీప్‌ పబ్లిసిటి అంటూ భర్త ఫైర్‌ | Gain Cheap Popularity: Vinesh Phogat Husband Blasts Claims Of Rs16 Crore Cash Prize After Olympics 2024 | Sakshi
Sakshi News home page

Vinesh Phogat: వినేశ్‌కు రూ. 16 కోట్ల నజరానాలు?.. చీప్‌ పబ్లిసిటి అంటూ భర్త ఫైర్‌

Published Mon, Aug 19 2024 7:56 PM | Last Updated on Mon, Aug 19 2024 8:30 PM

Gain Cheap Popularity: Vinesh Phogat Husband Blasts Claims Of Rs16 Crore Cash Prize

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌కు భారీ నజరానాలు అందాయన్న ప్రచారాన్ని ఆమె భర్త సోమ్‌వీర్‌ రాఠీ ఖండించాడు. కేవలం ప్రచార యావతోనే కొంతమంది ఇలాంటి చవకబారు చర్యలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో 50 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగంలో పోటీపడ్డ వినేశ్‌ ఫొగట్‌ ఫైనల్‌ చేరిన విషయం తెలిసిందే.

పసిడి పతకంపై ఆశలు ఆవిరి
ప్రి క్వార్టర్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ సుసాకీ(జపాన్‌)ను ఓడించిన వినేశ్‌.. ఆ తర్వాత క్వార్టర్‌, సెమీ ఫైనల్లో వరుస విజయాలు సాధించింది. అయితే, స్వర్ణ పతక రేసులో పాల్గొనే క్రమంలో నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా అనూహ్య రీతిలో అనర్హత వేటుకు గురైంది వినేశ్‌. ఫలితంగా పసిడి పతకంపై ఆశలు పెట్టుకున్న భారతీయుల హృదయాలు ముక్కలయ్యాయి.

అండగా అభిమానులు
అయినప్పటికీ వినేశ్‌ ఫొగట్‌ పోరాట పటిమను.. బరువు తగ్గే క్రమంలో ప్రాణాలకు తెగించి ఆమె కసరత్తులు చేసిన తీరును ప్రశంసిస్తూ అందరూ ఆమెకు అండగా నిలబడ్డారు. ఈ క్రమంలో ఈ హర్యానా రెజ్లర్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘‘పతకం కంటే మాకు నువ్వే ఎక్కువ బంగారం’’అంటూ యావత్‌ భారతావని ఆమెకు మద్దతు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో వినేశ్‌ ఫొగట్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు కొందరు ప్రయత్నించినట్లు సమాచారం. ఇందులో భాగంగా సుభాష్‌ ఫౌజీ అనే ఓ ఎక్స్‌ యూజర్‌.. వినేశ్‌ ఫొగట్‌కు రూ. 16  కోట్ల రూపాయలకు పైగా క్యాష్‌ రివార్డు అందిందంటూ పోస్ట్‌ చేశారు. రాజకీయంగా ఓ పార్టీని టార్గెట్‌ చేస్తూ అందుకు వినేశ్‌ ఫొటోలను వాడుకున్నారు.

తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి
ఈ ట్వీట్‌పై స్పందించిన వినేశ్‌ ఫొగట్‌ భర్త, రెజ్లర్‌ సోమ్‌వీర్‌ రాఠీ.. ‘‘ఏ సంస్థల నుంచి గానీ, వ్యాపారస్తులు, కంపెనీలు, పార్టీల నుంచి గానీ వినేశ్‌ ఫొగట్‌ డబ్బు తీసుకోలేదు. మా శ్రేయోభిలాషులారా.. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి. ఇలాంటివి మాకు హాని తలపెట్టలేవు. కానీ.. సామాజిక విలువలను ప్రభావితం చేస్తాయి. కేవలం చవకబారు ప్రచారం కోసమే ఇలాంటివి చేస్తారు’’ అని ఫైర్‌ అయ్యాడు. 

చదవండి: ‘అతడు లేకుంటే నేను లేను’.. వినేశ్‌ ఫొగట్‌ భర్త గురించి తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement