![India hockey team gets toned down hero's welcome on arrival after Paris Olympics](/styles/webp/s3/article_images/2024/08/10/indian-hockey-team.jpg.webp?itok=_t_IHWpv)
ఒలింపిక్స్ కాంస్య పతకంతో స్వదేశానికి చేరుకున్న భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం లభించింది. శనివారం ప్యారిస్ నుంచి ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన భారత హాకీ జట్టుకు అభిమానులు పుష్ప గుచ్చాలతో ఆపూర్వ స్వాగతం పలికారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ విశ్వ క్రీడల్లో భాగంగా గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై భారత్ విజయం సాధించింది.
అంతకుముందు సెమీఫైనల్లో జెర్మనీ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. కానీ కాంస్య పతక మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సేన పంజా విసిరింది. ఇక కాంస్య పతకం విజయంతో భారత స్టార్ గోల్ కీపర్ శ్రీజేష్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలికాడు.
🇮🇳Indian Men's Hockey Team players arrive at Delhi airport after winning a bronze medal at the #Paris2024 🥉#Hockey #HarmanpreetSingh #Olympics pic.twitter.com/6O7BTlOy4u
— InsideSport (@InsideSportIND) August 10, 2024
Comments
Please login to add a commentAdd a comment