
యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై భారత ఒలింపిక్ సంఘం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అంతిమ్‌తో పాటు ఆమె సహాయక సిబ్బందిని గురువారమే స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. వీరంతా నిబంధనలు ఉల్లంఘించారని ఫ్రెంచి అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024 మహిళల రెజ్లింగ్‌లో భారత్‌కు మరో నిరాశాజనక ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తుందనుకున్న 19 ఏళ్ల అంతిమ్ పంఘాల్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. టర్కీ రెజ్లర్ యెట్‌గిల్ జెనెప్‌తో జరిగిన బౌట్‌లో అంతిమ్ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో ఓటమి చవిచూసింది.
యెట్‌గిల్ ధాటికి అంతిమ్ 1 నిమిషం 41 సెకన్లలో ప్రత్యర్థికి 10 పాయింట్లు సమర్పించుకుంది. ఇద్దరి రెజ్లర్ల మధ్య 10 పాయింట్ల తేడా వచ్చిన వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపి వేసి పది పాయింట్ల ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. యెట్‌గిల్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడంతో అంతిమ్‌కు రెపిచాజ్ పద్ధతిలో కనీసం కాంస్య పతకం గెలిచే అవకాశం కూడా లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో నిరాశలో కూరుకుపోయిన అంతిమ్.. వెంటనే ఒలింపిక్ గ్రామాన్ని వీడి.. తన కోచ్, సోదరి బస చేస్తున్న హోటల్‌కు వచ్చేసింది. అయితే, తన వస్తువులు ఒలింపిక్ విలేజ్‌లో ఉన్నాయని గ్రహించిన అంతిమ్.. తనకు బదులు తన సోదరిని అక్కడికి పంపినట్లు సమాచారం. ఆమె అంతిమ్ అక్రిడేషన్ కార్డుతో ఒలింపిక్ విలేజ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. భద్రతా అధికారులు ఆమెను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం దృష్టికి తీసుకురాగా.. అంతిమ్ పంఘాల్‌పై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే.. 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఫలితంగా అనూహ్య రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
చదవండి: వినేశ్ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది?
Comments
Please login to add a commentAdd a comment