యూఎస్ ఓపెన్ 2024 పెను సంచలనం నమోదైంది. ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్‌కరాజ్ రెండో రౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. నెదర్లాండ్స్‌కు చెందిన 74వ ర్యాంక్ ప్లేయర్ బొటిక్ వాన్ డి జాండ్‌స్కల్ప్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.
బొటిక్ 6-1, 6-5, 6-4 తేడాతో వరుస సెట్లలో అల్‌కరాజ్‌పై విజయం సాధించాడు. 2021 వింబుల్డన్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌లో రెండో రౌండ్‌లోనే నిష్క్రమించడం అల్‌కరాజ్‌కు ఇది తొలిసారి.
ఈ సీజన్‌లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లు సాధించిన అల్‌కరాజ్ ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌తో పాటు యూఎస్ ఓపెన్ కూడా గెలిచి ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా నిలవాలనుకున్న అల్‌కరాజ్ ఆశలపై బొటిక్ నీళ్లు చల్లాడు.
ఇదిలా ఉంటే, పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ జన్నిక్ సిన్నెర్, డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్, నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కొకోగాఫ్, సబలెంకా కూడా రెండో రౌండ్‌ను దాటారు. అయితే నయోమి ఒసాకా రెండో రౌండ్‌లో పరాజయాన్ని చవిచూసింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన కరోలినా ముచోవా ఒసాకాపై 6-3, 7-6 తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment