ప్రపంచ మూడో ర్యాంకర్‌ను ఓడించిన నెదర్లాండ్స్ ప్లేయర్ బోటిక్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుక్రవారం పెను సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో 2022 చాంపియన్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన కార్లోస్ అల్‌కరాజ్ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అల్‌కరాజ్‌ను నెదర్లాండ్స్‌కు చెందిన ప్రపంచ 74వ ర్యాంకర్ బోటిక్ వాన్ డె జాండ్‌షుల్ప్ వరుస సెట్‌లలో ఓడించి తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయం సాధించాడు.
2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోటిక్ 6–1, 7–5, 6–4తో మూడో సీడ్ అల్‌కరాజ్‌ను ఓడించి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. యూఎస్ ఓపెన్‌లో అల్‌కరాజ్ రెండో రౌండ్‌లోనే ఓడిపోవడం ఇదే ప్రథమం. 2021లో క్వార్టర్ ఫైనల్ చేరిన అతను, 2022లో ఏకంగా విజేతగా అవతరించాడు. 2023లో అల్‌కరాజ్ సెమీఫైనల్లో ని్రష్కమించాడు.
అల్‌కరాజ్‌తో మ్యాచ్‌లో బోటిక్ ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 22 విన్నర్స్ కొట్టిన బోటిక్ 21 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు అల్‌కరాజ్ 27 అనవసర తప్పిదాలు చేశాడు. ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), పదో సీడ్ డిమినార్ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్‌లోకి ప్రవేశించగా... 16వ సీడ్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా) రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు.
Comments
Please login to add a commentAdd a comment