టెన్నిస్ లెజెండ్‌కు క్యాన్సర్‌.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరం | Tennis legend Chris Evert faces cancer again, set to miss Australian Open 2024 | Sakshi
Sakshi News home page

#Chris Evert: టెన్నిస్ లెజెండ్‌కు క్యాన్సర్‌.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరం

Published Sat, Dec 9 2023 12:39 PM | Last Updated on Sat, Dec 9 2023 12:59 PM

Tennis legend Chris Evert faces cancer again, set to miss Australian Open 2024 - Sakshi

అమెరికా టెన్నిస్ లెజెండ్‌, ఈస్పీఎన్‌ ఎనలిస్ట్‌ క్రిస్ ఎవర్ట్ మరోసారి క్యాన్సర్‌ బారిన పడింది. దీంతో జనవరిలో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 ఈస్పీఎన్‌ నెట్‌వర్క్ కవరేజీకి ఆమె దూరమైంది. ఈ విషయాన్ని ఈస్పీఎన్‌ సోషల్‌ మీడియా వేదికగా శనివారం వెల్లడించింది. ఆమె పేరిట ఓ నోట్‌ను ఈస్పీఎన్‌ నెట్‌వర్క్‌ పోస్ట్‌ చేసింది.

కాగా అంతకుముందు 2022 జనవరిలో క్రిస్ ఎవర్ట్ అండాశయ క్యాన్సర్‌తో బాధపడింది. అయితే 11 నెలల తర్వాత ఆమె క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకోనున్నట్లు తెలిపింది. కానీ 66 ఏళ్ల వయస్సులో మళ్లీ ఆమె క్యాన్సర్‌ బారిన పడడం అభిమానులలో ఆందోళన కలిగిస్తోంది.

ఆమె ఒక టెన్నిస్‌ లెజెండ్‌..
టెన్నిస్‌ చరిత్రలో క్రిస్ ఎవర్ట్ తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది.  క్రిస్ ఎవర్ట్ 1975 నుండి 1986 వరకు వరల్డ్‌ నెం1 లేదా రెండో ర్యాంక్‌లోనే కొనసాగింది.  టెన్నిస్‌లో 1,000 సింగిల్స్ విజయాలను సాధించిన మొదటి టెన్నిస్‌ క్రీడాకారిణిగా ఎవర్ట్ నిలిచింది. 1995లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కూడా ఎవర్ట్‌కు చోటు దక్కింది. క్రిస్ ఎవర్ట్ తన కెరీర్‌లో 18 సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement