ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్‌ల మధ్య మైదానంలో పోటీ అంటేనే ఓ సమరాన్ని తలపిస్తుంది. పెద్ద హడావుడి, హంగు, ఆర్భాటం అంతా కనిపిస్తుంది. అయితే ఇదంతా క్రికెట్‌కే పరిమితం. టెన్నిస్ అంటే ఆసక్తి అంతంతమాత్రమే! ఇప్పుడు కూడా ఆరు దశాబ్దాల తర్వాత ఇరు జట్ల మధ్య పాక్ గడ్డపై ప్రతిష్టాత్మక డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్–1 పోటీలు జరగాల్సి ఉంటే... దేశంలో, రాష్ట్రంలో కాదుకదా... కనీసం వేదికైన ఇస్లామాబాద్‌లో కూడా చడీచప్పుడు లేనేలేదు.
ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కేవలం మీడియా, పాకిస్తాన్ టెన్నిస్ సమాఖ్య (పీటీఎఫ్) నిర్వాహకులు తప్ప ఇంకెవరి అడుగులు, చూపులు అటువైపు పడటం లేదు. మ్యాచ్‌ల కోసం పాస్‌లు, వీఐపీ పాస్‌లు కావాలనే ప్రతిపాదనలు కూడా రావట్లేదు. రేపు, ఎల్లుండి డేవిస్ కప్ మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్‌కు వచ్చిన భారత టెన్నిస్ జట్టు సభ్యులకు అక్కడి భారత హైకమిషనర్ గీతిక శ్రీవాస్తవ విందు ఏర్పాటు చేసి ఆటగాళ్లకు బెస్టా్టఫ్ లక్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment