
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నీలో బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ రిత్విక్–నిక్కీ పునాచా ద్వయం 6–1, 6–3తో జేకబ్ బ్రాడ్‌షా (ఆస్ట్రేలియా)–బోరిస్ బుతుల్యా (సెర్బియా) జోడీని ఓడించింది.
హైదరాబాద్‌కు చెందిన రిత్విక్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిక్కీ గత ఏడాది ఐటీఎఫ్ సర్క్యూట్‌లో విశేషంగా రాణించి ఏడు డబుల్స్ టైటిల్స్, ఈ ఏడాది ఒక డబుల్స్ టైటిల్‌ను సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment