ITF tourney
-
ITF Mens Tourney: క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నీలో బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ రిత్విక్–నిక్కీ పునాచా ద్వయం 6–1, 6–3తో జేకబ్ బ్రాడ్షా (ఆస్ట్రేలియా)–బోరిస్ బుతుల్యా (సెర్బియా) జోడీని ఓడించింది. హైదరాబాద్‌కు చెందిన రిత్విక్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిక్కీ గత ఏడాది ఐటీఎఫ్ సర్క్యూట్లో విశేషంగా రాణించి ఏడు డబుల్స్ టైటిల్స్, ఈ ఏడాది ఒక డబుల్స్ టైటిల్‌ను సాధించారు. -
ఫైనల్లో విష్ణువర్ధన్ జంట
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నీలో భారత డేవిస్‌కప్ జట్టు మాజీ సభ్యుడు, హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ విష్ణువర్ధన్–శశికుమార్ ముకుంద్ (భారత్) జంట 6–3, 2–6, 10–8తో మూడో సీడ్ సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయంపై గెలుపొందింది. -
ఐటీఎఫ్ టోర్నీకి సౌమ్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అమ్మాయి ఆర్. సౌమ్యకు అరుదైన అవకాశం దక్కింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే అంతర్జాతీయ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్ (ఐటీఎఫ్)లో పాల్గొనే ముగ్గురు సభ్యులతో కూడిన భారత జట్టులో ఆమె స్థానం దక్కించుకుంది. అండర్–14 విభాగంలో పాల్గొనే భారత్ జట్టులో నుంచి హరియాణా ప్లేయర్ శ్రుతి అహ్లావత్ అనారోగ్యంతో వైదొలగడంతో... సౌమ్యకు పిలుపొచ్చింది. ప్రస్తుతం భారత నంబర్–4 ర్యాంకర్‌గా ఉన్న సౌమ్య ఆసియాలో 30వ ర్యాంకులో ఉంది. ప్రస్తుతం సౌమ్య ఆసిఫ్ టెన్నిస్ క్లబ్లో కోచ్ నార్లీకర్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతుంది. -
ఫైనల్‌కు పిమ్రదా, సందీప్తి
సాక్షి, హైదరాబాద్: రాజా నరసింహారావు స్మారక అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టోర్నమెంట్లో టాప్ సీడ్ పిమ్రదా జటావపోర్నవిట్ (థాయ్‌లాండ్), ఎనిమిదో సీడ్ సందీప్తి సింగ్ (భారత్) ఫైనల్‌కు చేరుకున్నారు. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన అండర్–18 బాలికల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో పిమ్రదా 6–1, 6–3తో నాలుగో సీడ్ యిఫాన్ సున్ (చైనా)పై గెలుపొందగా... సందీప్తి సింగ్ 6–3, 6–4తో హైదరాబాద్ ప్లేయర్ వినీత ముమ్మడిని ఓడించింది. బాలుర సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు చిరాగ్ దుహాన్, ధ్రువ్ పోరాటం సెమీస్‌లో ముగిసింది. సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో చిరాగ్ 7–5, 3–6, 1–6తో పటోర్న్ హన్‌చైకుల్ (థాయ్‌లాండ్) చేతిలో, ధ్రువ్ 2–6, 6–4, 5–7తో అదిత్ సిన్హా (అమెరికా) చేతిలో ఓడిపోయారు. బాలికల డబుల్స్ విభాగంలో భారత జోడీలు సెమీస్‌లో ఓటమి పాలవ్వగా... బాలుర డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులు ఫైనల్‌కు చేరుకున్నారు. అండర్–18 బాలుర డబుల్స్ తొలి సెమీస్‌లో ఆర్యన్ భాటియా–చిరాగ్ దుహాన్ (భారత్) జోడీకి చైనా జోడీ నుంచి వాకోకవర్ లభించింది. రెండో సెమీస్‌లో నిశాంత్ దబాస్ (భారత్)–తనపట్ నిరున్‌డోర్న్ (థాయ్‌లాండ్) జంట 7–6 (7), 2–6, 10–5తో సంజీత్ దేవినేని (అమెరికా)–ఉదిత్ గొగోయ్ (భారత్) జోడీపై గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. బాలికల డబుల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ సారాదేవ్–ప్రేరణ విచారే (భారత్) ద్వయం 2–6, 1–6తో టాప్‌సీడ్ పిమ్రదా–లాన్లనా (థాయ్‌లాండ్) జోడీ చేతిలో, వినీత–సందీప్తి (భారత్) జోడీ 2–6, 0–6తో యటావీ చిమ్‌చమ్ (థాయ్‌లాండ్)–మల్లికా (భారత్) జంట చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి ని్రష్కమించాయి. -
ఐటీఎఫ్ టోర్నీ ఫైనల్లో సిద్ధార్థ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో భారత ప్లేయర్ సిద్ధార్థ్ రావత్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. థాయ్‌లాండ్‌లోని నొంతభురిలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ సిద్ధార్థ్ 6–4, 6–2తో ఎనిమిదో సీడ్ యు సియో సు (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. మరో సెమీఫైనల్లో ఐదో సీడ్ రియోనొగుచి (జపాన్) 6–4, 7–5తో అలెగ్జాండర్ క్రానోర్క్ (ఆస్ట్రేలియా)పై గెలిచి నేడు జరిగే ఫైనల్లో సిద్ధార్థ్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. యు సియో సుతో జరిగిన సెమీస్‌లో సిద్ధార్థ్‌కు ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సిద్ధార్థ్ ఏడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. -
అనిరుధ్ జంటకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు నిక్కీ పూనాచ సత్తా చాటారు. ఉగాండాలోని కంపాలాలో జరిగిన ఈ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ విభాగంలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన వీరిద్దరూ తమ హోదాకు న్యాయం చేస్తూ టైటిల్‌ను గెలుచుకున్నారు. టైటిల్‌పోరులో టాప్ సీడ్ అనిరుధ్ చంద్రశేఖర్–నిక్కీ పూనాచ (భారత్) జంట 6–3, 6–4తో సిమోన్ కర్ (ఐర్లాండ్)–ర్యాన్ జేమ్స్ స్టోరీ (బ్రిటన్) జోడీపై వరుస సెట్లలో విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో అనిరుధ్ చంద్రశేఖర్–నిక్కీ పూనాచ ద్వయం 6–2, 6–4తో మూడోసీడ్ సెర్గీ టోలోటోవ్ (రష్యా)–ఎస్డీ ప్రజ్వల్ దేవ్ (భారత్) జోడీపై సులువుగా గెలుపొందింది. క్వారర్ ఫైనల్లో అనిరు«ద్ జోడీకి గట్టి పోటీ ఎదురైంది. తొలి సెట్‌ను కోల్పోయిన అనిరు«ద్ జంట తర్వాత పుంజుకుంది. ఈ మ్యాచ్‌లో 4–6, 6–3 (10/6)తో జులియన్ బ్రాడ్లీ (ఐర్లాండ్)–ఓర్లీ ఐరాడుకున్‌డ (బురుండి) జోడీపై నెగ్గి బరిలో నిలిచింది. తొలి రౌండ్లో 6–2, 6–1తో తరుణ్ చిలకలపూడి–అభినవ్ సంజీవ్ (భారత్) జంటపై గెలుపొందింది. -
క్వార్టర్స్‌లో రష్మిక
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్స్ గ్రేడ్–3 టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారులు శ్రీవల్లి రష్మిక, అమినేని శివాని క్వార్టర్స్‌కు చేరుకున్నారు. పుణేలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్) 2–6, 7–5, 6–3తో యు యున్ లీ (చైనీస్ తైపీ)పై, టాప్ సీడ్ శివాని 6–2, 6–2తో గార్గి పవార్ (భారత్)పై విజయం సాధించారు. సంజన సిరిమల్ల 3–6, 5–7తో కొహరు నిమి (జపాన్) చేతిలో పరాజయం పాలై తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. డబుల్స్ విభాగంలో రష్మిక జంట క్వార్టర్స్‌లో, శివాని జోడీ తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాయి. బాలికల డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక (భారత్)–చెయ్ హున్ సిమ్ (కొరియా) ద్వయం 3–6, 6–3, 10–6తో ప్రియాన్షి–సుదీప్త (భారత్) జంటపై గెలుపొంది... క్వార్టర్స్‌లో 2–6, 1–6తో టాప్ సీడ్ మాటిల్డా ముతాజిక్–ఎరిన్ రిచర్డ్సన్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. శివాని–శరణ్య జంట 1–6, 3–6తో మల్లిక –మెయ్ హసేగవా (జపాన్) జంట చేతిలో తొలి రౌండ్లోనే ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టోర్నీలో హైదరాబాద్ అమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, అమినేని శివాని క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ఢిల్లీలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రష్మిక 6–3, 6–3తో అనన్య గోయెల్‌పై గెలుపొందింది. అంతకుముందు తొలి రౌండ్లో రష్మిక 6–3, 6–3తో జగ్మీత్ కౌర్‌ను ఓడించింది. మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్ సీడ్ శివాని అమినేని 6–3, 6–4తో సారా దేవ్‌పై నెగ్గింది. -
సెమీస్‌లో సాయి కార్తీక్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు సాయి కార్తీక్‌రెడ్డి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఎల్బీ స్టేడియంలో బుధవారం జరిగిన బాలుర సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో ఐదోసీడ్ గంటా సాయి కార్తీక్‌రెడ్డి 6–1, 7–6 (6)తో కబీర్ హాన్స్‌పై విజయం సాధించాడు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ప్లేయర్ ఎం. తీర్థ శశాంక్ 0–6, 1–6తో మేఘ్ భార్గవ్ పటేల్ చేతిలో ఓటమి పాలయ్యాడు. డెనిమ్ యాదవ్ 6–1, 6–4తో అనురా అగర్వాల్‌పై గెలుపొందాడు. డబుల్స్ విభాగంలో తీర్థ శశాంక్ జోడీ సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో నాలుగోసీడ్ తీర్థ శశాంక్ – కెవిన్ పటేల్ ద్వయం 6–4, 6–2తో కృషన్ హుడా– డివిన్ వాద్వా జోడీపై నెగ్గింది. మరో మ్యాచ్‌లో సాయికార్తీక్ రెడ్డి– నైథాలిన్ కెల్విన్ జోడీ 6–7 (6), 1–6తో కబీర్ హాన్స్– తేజస్వి ఆర్. మెహ్రా ద్వయం చేతిలో పరాజయం పాలైంది. బాలికల క్వార్టర్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి రెండోసీడ్ శివాని అమినేని 3–6, 3–6తో సందీప్తి సింగ్ రావు చేతిలో ఓటమి పాలైంది. బాలికల డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్ సీడ్ శివాని అమినేని (భారత్)– మయి నపట్ నిరుండర్న్ (థాయ్‌లాండ్) ద్వయం 6–3, 6–3తో అనన్య– భక్తి షా (భారత్) జంటపై నెగ్గి సెమీస్‌కు చేరింది. ,, , -
‘మెయిన్ డ్రా’కు అపురూప్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టోర్నీ మెయిన్‌డ్రా పోటీలకు హైదరాబాద్ ప్లేయర్ అపురూప్ రెడ్డి అర్హత సాధించాడు. చైనాలో జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో అçపురూప్ మెరుగ్గా రాణించాడు. అరబిందో ఫార్మా కంపెనీ స్పాన్సర్‌షిప్‌తో ఈ టోర్నీలో ఆడుతోన్న అపురూప్కు తొలిరౌండ్లో ‘బై’ లభించగా... రెండోరౌండ్లో 6–4, 3–0తో వింటర్ మేజర్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. రెండో సెట్లో అపురూప్ 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగాడు. చివరిదైన మూడో రౌండ్లో 6–4, 6–4తో జి ఆంగ్ లీ (చైనా)పై విజయం సాధించి మంగళవారం నుంచి ప్రారంభమయ్యే మెయిన్‌డ్రా పోటీలకు అర్హత సాధించాడు. -
డబుల్స్ రన్నరప్ వినాయక్ జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్–3 పురుషుల టోర్నీలో తెలుగు కుర్రాడు కాజా వినాయక్ శర్మకు నిరాశ ఎదురైంది. చండీగఢ్‌లో ముగిసిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌లో వినాయక్ శర్మ జోడీ రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో వినాయక్ శర్మ–మోహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్) ద్వయం 3–6, 1–6తో టాప్ సీడ్ అర్జున్–విజయ్ సుందర్ ప్రశాంత్ జంట చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు సింగిల్స్ విభాగంలో భారత్‌కు చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఫైనల్‌పోరుకు అర్హత సాధించాడు. ఫైనల్లో నామ్ హాంగ్లీ (వియత్నాం)తో ప్రజ్నేశ్ తలపడతాడు. -
సెమీఫైనల్లో ప్రాంజల జోడీ
సాక్షి, హైదరాబాద్: శ్రీలంకలో జరుగుతున్న అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటుకుంది. ఆమె డబుల్స్‌లో సెమీస్‌లోకి, సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కొలంబోలో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ప్రాంజల–రుతూజా భోసలే జోడి 6–0, 6–0తో ప్రియాంక రాడ్రిక్స్ (భారత్) గాబ్రియెలా జుర జర్నొవియను (రొమేనియా) జంటపై అలవోక విజయం సాధించింది. తొలి రౌండ్లో భారత జోడీకి ‘బై’ లభించింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్ అమ్మాయి 7–6 (7/4), 6–0తో అలైస్ గిలాన్ (బ్రిటన్)పై గెలిచింది. భారత క్రీడాకారిణుల మధ్య జరిగిన పోరులో ఎనిమిదో సీడ్ జీల్ దేశాయ్ 6–0, 6–1తో చామర్తి సాయి సంహితను ఓడించగా... తెలుగు అమ్మాయి రిషిక సుంకర 4–6, 0–6తో యెగ్జిన్ మ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జీల్ దేశాయ్‌తో ప్రాంజల తలపడుతుంది. డబుల్స్ సెమీస్‌లో ప్రాంజల–రుతూజా జోడీ... టాప్ సీడ్ ఐనిండినొవా (కజకిస్తాన్)–క్యురోవిక్ (సెర్బియా) జంటతో తలపడుతుంది. మరో సెమీస్‌లో నాలుగో సీడ్ నిధి చిలుముల–ప్రేరణ బాంబ్రీ జోడీ... రెండో సీడ్ నటాషా పల్హా–రిషిక సుంకర జంటతో పోటీపడుతుంది. -
అనిరుధ్–విఘ్నేశ్ జంట ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల ఫ్యూచర్స్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారుల పోరాటం ముగిసింది. కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విఘ్నేశ్ పెరణమల్లూర్ జంట సెమీస్‌లో ఓటమి పాలైంది. గురువారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో అనిరుధ్ – విఘ్నేశ్ (భారత్) జంట 4–6, 6–7 (2/7)తో అర్జున్–శశి కుమార్ ముకుంద్ (భారత్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మరో సెమీస్ మ్యాచ్‌లో కాజా వినాయక్ శర్మ (ఏపీ)–మోహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్) ద్వయం 2–6, 2–6తో టాప్ సీడ్ చంద్రిల్ సూద్–లక్షిత్ సూద్ (భారత్) జంట చేతిలో ఓడిపోయింది. -
టైటిల్‌పోరుకు ప్రాంజల జోడి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ ఫైనల్‌కు చేరుకుంది. థాయ్‌లాండ్‌లో గురువారం జరిగిన ఈ టోర్నీ మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ప్రాంజల– జీల్ దేశాయ్ (భారత్) ద్వయం 6–2, 6–4తో కావో సికి– లి యువాన్ (చైనా) జంటపై గెలుపొందింది. ఫైనల్లో ప్రాంజల జోడీ భారత్‌కు చెందిన రితుజ భోస్లే– అలెగ్జాండ్రా వాల్టర్ (అమెరికా) జంటతో తలపడుతుంది. -
రెండో రౌండ్లో ప్రాంజల
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె రెండో రౌండ్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ ప్రాంజల 6–0, 6–0తో పిబాంగ్రుక్ నథ్పట్ (థాయ్‌లాండ్)పై గెలుపొందింది. మరో తెలుగు అమ్మాయి రిషిక సుంకర 0–6, 0–6తో మి జువామా యు (చైనా) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ తొలి రౌండ్లో సౌజన్య భవిశెట్టి–రిషిక ద్వయం 3–6, 5–7తో సవాస్ది–చనికర్న్ సిలాకుల్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. -
రిషబ్ ముందంజ
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ త్రివేండ్రం: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఆటగాళ్లు రిషబ్ అగర్వాల్, విష్ణువర్ధన్ ముందంజ వేశారు. త్రివేండ్రం టెన్నిస్ క్లబ్లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌లో రిషబ్ అగర్వాల్ 4–6, 6–3, 6–1తో భారత్‌కే చెందిన చంద్రిల్ సూద్‌పై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. మరో మ్యాచ్‌లో అనిరుధ్ చంద్రశేఖర్ 3–6, 6–7 (3/7)తో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–7 (3/7), 6–4, 10–3తో అలెగ్జాండర్ సెంటినరీ (అమెరికా)–సామి రెన్‌వెన్ (జర్మనీ) జంటపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో ‘సూద్’ బ్రదర్స్ చంద్రిల్– లక్షిత్ (భారత్) జంట 6–1,6–2తో మొహమ్మద్ నజీమ్– గౌతమ్ కృష్ణన్ రమేశ్ జోడీపై గెలుపొందింది.