సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టోర్నీ మెయిన్‌డ్రా పోటీలకు హైదరాబాద్ ప్లేయర్ అపురూప్ రెడ్డి అర్హత సాధించాడు. చైనాలో జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో అçపురూప్ మెరుగ్గా రాణించాడు. అరబిందో ఫార్మా కంపెనీ స్పాన్సర్‌షిప్‌తో ఈ టోర్నీలో ఆడుతోన్న అపురూప్‌కు తొలిరౌండ్‌లో ‘బై’ లభించగా... రెండోరౌండ్‌లో 6–4, 3–0తో వింటర్ మేజర్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు.
రెండో సెట్‌లో అపురూప్ 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగాడు. చివరిదైన మూడో రౌండ్‌లో 6–4, 6–4తో జి ఆంగ్ లీ (చైనా)పై విజయం సాధించి మంగళవారం నుంచి ప్రారంభమయ్యే మెయిన్‌డ్రా పోటీలకు అర్హత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment