
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్–3 పురుషుల టోర్నీలో తెలుగు కుర్రాడు కాజా వినాయక్ శర్మకు నిరాశ ఎదురైంది. చండీగఢ్‌లో ముగిసిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌లో వినాయక్ శర్మ జోడీ రన్నరప్‌గా నిలిచింది.
శుక్రవారం జరిగిన ఫైనల్లో వినాయక్ శర్మ–మోహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్) ద్వయం 3–6, 1–6తో టాప్ సీడ్ అర్జున్–విజయ్ సుందర్ ప్రశాంత్ జంట చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు సింగిల్స్ విభాగంలో భారత్‌కు చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఫైనల్‌పోరుకు అర్హత సాధించాడు. ఫైనల్లో నామ్ హాంగ్‌లీ (వియత్నాం)తో ప్రజ్నేశ్ తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment