ఐటీఎఫ్‌ టోర్నీ ఫైనల్లో సిద్ధార్థ్‌ | Siddarth In Final of ITF Tourney | Sakshi
Sakshi News home page

ఐటీఎఫ్‌ టోర్నీ ఫైనల్లో సిద్ధార్థ్‌

Published Sun, Jun 2 2019 1:59 PM | Last Updated on Sun, Jun 2 2019 1:59 PM

Siddarth In Final of ITF Tourney - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నమెంట్‌లో భారత ప్లేయర్‌ సిద్ధార్థ్‌ రావత్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. థాయ్‌లాండ్‌లోని నొంతభురిలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్‌ సిద్ధార్థ్‌ 6–4, 6–2తో ఎనిమిదో సీడ్‌ యు సియో సు (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించాడు.

మరో సెమీఫైనల్లో ఐదో సీడ్‌ రియోనొగుచి (జపాన్‌) 6–4, 7–5తో అలెగ్జాండర్‌ క్రానోర్క్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి నేడు జరిగే ఫైనల్లో సిద్ధార్థ్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. యు సియో సుతో జరిగిన సెమీస్‌లో సిద్ధార్థ్‌కు ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సిద్ధార్థ్‌ ఏడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement