సెమీఫైనల్లో రిత్విక్‌ జోడీ పరాజయం   | Ritwik Jodi lost in the semi finals | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో రిత్విక్‌ జోడీ పరాజయం  

Published Sun, Apr 14 2024 4:26 AM | Last Updated on Sun, Apr 14 2024 4:26 AM

Ritwik Jodi lost in the semi finals - Sakshi

మొరెలోస్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–75 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్‌–నిక్కీ పునాచా జోడీ 4–6, 6–3, 7–10తో మత్సుజెవ్‌స్కీ (పోలాండ్‌)–మాథ్యూ రొమియోస్‌ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో అర్జున్‌–జీవన్‌ (భారత్‌) ద్వయం 4–6, 7–6 (7/5), 10–8తో జాన్సన్‌ (బ్రిటన్‌)–మన్సూరి (ట్యూనిషియా) జంటపై నెగ్గి ఫైనల్‌ చేరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement