వింబుల్డన్‌-2023లో సంచలనం.. టాప్‌ ప్లేయర్‌కు షాక్‌ | Wimbledon 2023: Wildcard Liam Broady Stuns Fourth Seed Casper Ruud | Sakshi
Sakshi News home page

వింబుల్డన్‌-2023లో సంచలనం.. టాప్‌ ప్లేయర్‌కు షాక్‌

Published Fri, Jul 7 2023 9:03 AM | Last Updated on Fri, Jul 7 2023 10:33 AM

Wimbledon 2023: Wildcard Liam Broady Stuns Fourth Seed Casper Ruud - Sakshi

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగం రెండో రౌండ్‌లో సంచలనం నమోదైంది. బ్రిటన్‌ ప్లేయర్, వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ, ప్రపంచ 142వ ర్యాంకర్‌ లియామ్‌ బ్రాడీ 3 గంటల 27 నిమిషాల పోరులో 6–4, 3–6, 4–6, 6–3, 6–0తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే)ను బోల్తా కొట్టించాడు. గత ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌లలో, ఈ సంవత్సరం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన రూడ్‌ వింబుల్డన్‌ టోర్నీలో నాలుగో ప్రయత్నంలోనూ రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు.

ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 6–7 (4/7), 6–3, 6–4, 7–5తో కరాత్‌సెవ్‌ (రష్యా)పై, వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 6–3, 4–6, 6–4, 6–2తో ఎచెవరి (అర్జెంటీనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ లో ఐదో సీడ్‌ గార్సియా (ఫ్రాన్స్‌) 3–6, 6–4, 7–6 (10/6)తో లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా) పై నెగ్గింది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌) 4–6, 7–5, 1–6తో జూలీ నిమియెర్‌ (జర్మనీ) చేతిలో ఓడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement