
భారత టాప్ షూటర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత మనూ భాకర్ వయోలిన్ చేతబట్టింది. శనివారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇలా కనిపించింది.

శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ నిర్వహించిన దుర్గా పూజలో పాల్గొన్న అనంతరం నిర్వాహకులు ఆమెను సన్మానించారు.

ఈ సందర్భంగా తనకు ఇష్టమైన వయొలిన్‌ను వాయించి మను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్యారిస్ ఒలింపిక్స్-2024లో హర్యానాకు చెందిన మనూ భాకర్ రెండు పతకాలు గెలిచింది

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి.. కాంస్యాలు కైవసం చేసుకుంది.

తద్వారా ఆధునిక ఒలింపిక్స్ సింగిల్ ఎడిషన్‌లో రెండు మెడల్స్ గెలిచిన భారత తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.
