
ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకం ఖాయం చేసుకున్న భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. మహిళల 50కేజీల విభాగం ఫైనలో పోటీ పడాల్సిన వినేష్‌పై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది. పోటీ విభాగం(50 కేజీల) కంటే 100 గ్రాముల బరువు ఆధికంగా ఉండటంతో ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో వినేష్ పతక ఆశలు అవిరయ్యాయి.
సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన ఫోగట్ కచ్చితంగా బంగారు పతకం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ కేవలం 100 గ్రాముల బరువు 140 కోట్ల భారతీయుల గుండె పగిలేలా చేసింది. ఈ క్రమంలో వినేష్ ఫోగట్‌కు రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించేసింది.
గురువారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ఫోగట్ వెల్లడించింది. తనకు మరి పోరాడే బలం లేదని వినేష్ తన రిటైర్మెంట్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే తనపై ఫొగాట్ తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని ఛాలంజ్ చేస్తూ.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తను రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీనిపై ఆర్భిట్రేషన్ ఇంకా తీర్పు వెల్లడించలేదు. ఈ క్రమంలో ఆర్భిట్రేషన్ తీర్పు ఫోగట్‌కు అనుకూలంగా రావాలని యావత్ భారత్ కోరుకుంటుంది.
ఫోగాట్‌కు సిల్వర్ మెడల్ ఇస్తారా?
2016 రియో ఒలింపిక్స్ తర్వాత రెజ్లింగ్ పోటీలను రెండు రోజులు నిర్వహిస్తున్నారు. అప్పటి వరకు ఒకసారి తొలి మ్యాచ్‌కు ముందు బరువు చూశాక కొందరు బలమైన ఆహారాన్ని తీసుకుంటూ తర్వాతి రౌండ్‌లలో చెలరేగారు. రెజ్లింగ్, బాక్సింగ్, జూడో తదితర యుద్ధ క్రీడల్లో సమ ఉజ్జీల మధ్యే పోరాటం జరగాలని, ఎక్కువ బరువు ఉన్నవారికి ఎలాంటి అదనపు ప్రయోజనం దక్కరాదనే కారణంతో రూల్ మార్చారు.
నిబంధనల ప్రకారం రెండు రోజులూ బరువు చూస్తారు. రెండో రోజు 15 నిమిషాల సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే ప్లేయర్లు 48 గంటల పాటు కడుపు మాడ్చుకొని అయినా సరే బరువు పెరగకుండా జాగ్రత్త పడతారు. సెమీస్ వరకు గెలిచింది కాబట్టి రజతం ఇవ్వవచ్చనే వాదన కొందరు లేవనెత్తారు.
కానీ నిబంధనల ప్రకారం ఏ దశలో బరువు లెక్క తప్పినా అన్ని బౌట్‌ల ఫలితాలను రద్దు చేస్తారు. బరువు తగ్గే అవకాశం లేదని అర్థం కాగానే గాయం సాకుతో ఫైనల్‌కు ముందు ఓటమిని ఒప్పుకొని తప్పుకోవాల్సిందని కూడా అభిమానులు అనుకున్నారు. కానీ అదీ నిబంధనలకు విరుద్ధం.
అంతకుముందు మ్యాచ్‌లలో పోటీ పడుతూ మధ్యలో గాయమైతే తప్ప ప్లేయర్ రెండో వెయింగ్‌లో తప్పనిసరిగా బరువు చూపించాల్సిందే. అలా చేయకపోయినా అనర్హత వేటు పడుతుంది కాబట్టి వినేశ్‌కు ఆ అవకాశమూ లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment