ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్ మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం విధితమే. అయితే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ జస్పాల్ రాణా.. ఒలింపిక్స్ భారత షూటర్ల సెలక్షన్ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్ విధానాల వల్ల యువ షూటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని రాణా అసహనం వ్యక్తం చేశాడు.
"ఫెడరేషన్ సెలక్షన్ పాలసీ ప్రతీ ఆరు నెలలకోసారి మారుతుంది. ఈ విషయం గురించి ఇప్పటికే క్రీడా మంత్రితో నేను మాట్లాడాను. ఫెడరేషన్ నుంచి సెలక్షన్ పాలసీని తెప్పించుకోని, ఓసారి పరిశీలించాలని కోరాను.
అది చూశాక వారు ఏ నిర్ణయం తీసుకున్న మేము కట్టుబడి ఉంటాము. ఆ తర్వాత ఈ విషయం గురించి అస్సలు చర్చించం. షూటర్లకు అండగా నిలిస్తే కచ్చితంగా వారి ప్రదర్శనలలో మనం మార్పులు చూస్తాం. భారత షూటింగ్ ఫెడరేషన్ విధి విధానాల వల్ల ఎంతో మంది యువ షూటర్లు ముందుకు వెళ్లలేకపోతున్నారు.
భారత్‌లో అత్యుత్తమ షూటర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి సపోర్ట్‌గా నిలిచే వారు ఎవరూ లేరు. పిస్టల్ షూటర్ సౌరభ్ చౌదరి ఎక్కడ? ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ పిస్టల్ షూటర్ జితూ రాయ్ ఎక్కడ? వీరిగురించి ఎవరూ మాట్లడటం లేదు.
పారిస్‌లో నాలుగో స్థానంలో నిలిచిన (10మీ ఎయిర్ రైఫిల్ షూటర్) అర్జున్ బాబుటా గురించి అస్సలు చర్చే లేదు. అతను స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయాడు. మళ్లీ అతడిని ఈ ప్లాట్‌ఫామ్‌కు తీసుకు రావాలని ఎవరూ ఆలోచించడం లేదని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్పాల్ రాణా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment