jaspal rana
-
సౌరభ్ చౌదరి ఎక్కడ? రైఫిల్ సమాఖ్యపై మండిపడ్డ మను కోచ్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్ మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం విధితమే. అయితే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ జస్పాల్ రాణా.. ఒలింపిక్స్ భారత షూటర్ల సెలక్షన్ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్ విధానాల వల్ల యువ షూటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని రాణా అసహనం వ్యక్తం చేశాడు. "ఫెడరేషన్ సెలక్షన్ పాలసీ ప్రతీ ఆరు నెలలకోసారి మారుతుంది. ఈ విషయం గురించి ఇప్పటికే క్రీడా మంత్రితో నేను మాట్లాడాను. ఫెడరేషన్ నుంచి సెలక్షన్ పాలసీని తెప్పించుకోని, ఓసారి పరిశీలించాలని కోరాను.అది చూశాక వారు ఏ నిర్ణయం తీసుకున్న మేము కట్టుబడి ఉంటాము. ఆ తర్వాత ఈ విషయం గురించి అస్సలు చర్చించం. షూటర్లకు అండగా నిలిస్తే కచ్చితంగా వారి ప్రదర్శనలలో మనం మార్పులు చూస్తాం. భారత షూటింగ్ ఫెడరేషన్ విధి విధానాల వల్ల ఎంతో మంది యువ షూటర్లు ముందుకు వెళ్లలేకపోతున్నారు. భారత్‌లో అత్యుత్తమ షూటర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి సపోర్ట్‌గా నిలిచే వారు ఎవరూ లేరు. పిస్టల్ షూటర్ సౌరభ్ చౌదరి ఎక్కడ? ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ పిస్టల్ షూటర్ జితూ రాయ్ ఎక్కడ? వీరిగురించి ఎవరూ మాట్లడటం లేదు. పారిస్‌లో నాలుగో స్థానంలో నిలిచిన (10మీ ఎయిర్ రైఫిల్ షూటర్) అర్జున్ బాబుటా గురించి అస్సలు చర్చే లేదు. అతను స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయాడు. మళ్లీ అతడిని ఈ ప్లాట్‌ఫామ్‌కు తీసుకు రావాలని ఎవరూ ఆలోచించడం లేదని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్పాల్ రాణా పేర్కొన్నాడు. -
నాడు కోచ్‌తో మనూ గొడవ.. కట్ చేస్తే!
మనూ భాకర్.. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్యం గెలిచిన ఈ హర్యానా అమ్మాయి.. భారత్ తరఫున మెడల్ గెలిచిన తొలి మహిళా షూటర్‌గా రికార్డు సాధించింది. ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పతకాలు అందుకున్న మనూ భాకర్ ఖాతాలో.. ఇప్పుడు ఒలింపిక్ మెడల్ కూడా చేరింది. టోక్యోలో నిరాశ ఎదురైనా పడిలేచిన కెరటంలా మనూ ‘బుల్లెట్’లా దూసుకొచ్చిన తీరు అద్భుతం. అయితే, ఈ ప్రయాణంలో 22 ఏళ్ల మనూకు తన తండ్రి రామ్‌కిషన్ భాకర్ ప్రోత్సాహంతో పాటు.. కోచ్ జస్పాల్ రాణా.. ‘‘పెద్దన్న’’లా క్షమించి, మళ్లీ శిక్షణ తీరు నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఉపయోగపడింది. ఏమిటా కథ?!మనూ భాకర్ కెరీర్లో రెండు వేర్వేరు సందర్భాలు ఆమె ప్రస్థానంలో కీలకంగా నిలిచాయి. 2018–2019 సమయంలో మనూ వరుస విజయాలతో అద్భుత ఫామ్‌లో ఉంది. ఆ సమయంలో భారత జట్టు (పిస్టల్)కు మాజీ ఆటగాడు జస్పాల్ రాణా కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ సమయంలో 17 ఏళ్ల ఒక టీనేజర్ ఎలా దుందుడుగా, ఆవేశంగా ఉంటారో భాకర్ కూడా అదే తరహా మానసిక స్థితిలో ఉంది. కోచ్‌పై ఆగ్రహం.. ఎందుకంటే?రాణా కఠినమైన కోచింగ్ శైలి నచ్చక ఆమె బహిరంగంగానే చిన్న చిన్న విమర్శలు చేస్తూ వచ్చింది. కొంత కాలం తర్వాత ఇది మరింత పెరిగింది. మనూ వేర్వేరు ఈవెంట్లలో ఆడితే ఆమె విఫలమయ్యే అవకాశం ఉందని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్పైనే దృష్టి పెట్టాలంటూ రాణా సూచించాడు.మీ అహానికి అభినందనలు25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మరో షూటర్ చింకీ యాదవ్‌ను ప్రోత్సహించడాన్ని భాకర్ వ్యక్తిగతంగా తీసుకొని కోచ్‌పై మరింత ఆగ్రహాన్ని పెంచుకుంది. చివరకు టోక్యో ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు ఢిల్లీ వరల్డ్ కప్‌లో ఇది పూర్తిగా బయటపడింది. 10 మీటర్ల ఈవెంట్లో చింకీ స్వర్ణం గెలవగా, మనూ కాంస్యానికే పరిమితమైంది. దాంతో మనూ ‘ఆనందం దక్కింది కదా... మీ అహానికి అభినందనలు’ అంటూ రాణాకు మెసేజ్ చేసింది.‘సర్...నాకు మీరు మళ్లీ కోచింగ్ ఇస్తారా’ ఆ వాక్యాలను రాణా తన టీషర్ట్‌పై వెనుక భాగంలో రాసుకొని మైదానమంతా తిరిగాడు. దాంతో మనూతో అక్కడే అన్ని సంబంధాలు ముగిసిపోయాయి! కాలక్రమంలో రెండేళ్లు గడిచాయి. ఏడాది క్రితం మనూలో కొత్త మథనం మొదలైంది. తాను ఒలింపిక్ పతకం గెలవాలంటే సరైన దారి మళ్లీ సరైన కోచ్‌ను ఎంచుకోవడమే అనిపించింది. ఎంతో మథనం తర్వాత రాణాకు ‘సర్...నాకు మీరు మళ్లీ కోచింగ్ ఇస్తారా’ అని మెసేజ్ చేసింది.ఒక పెద్దన్న తరహాలో రాణా కూడా స్పందించాడు. గత అనుభవాన్ని మనసులోంచి తీసేసి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. సంవత్సర కాలంలో తనదైన శైలిలో ఆమెకు కోచింగ్‌తో పాటు ఇతర అన్ని సన్నాహకాల్లో అండగా నిలుస్తూ ఇప్పుడు ఒలింపిక్ పతకం వరకు తీసుకొచ్చాడు. వారి సన్నాహాల్లో ఒక ఆసక్తికర అంశం ఉంది.లక్ష్యంగా పెట్టుకున్న పాయింట్లు సాధించలేనప్పుడు తగ్గిన పాయింట్లలో ఒక్కో పాయింట్‌కు 10 యూరోల చొప్పున జరిమానా విధించి దానిని అక్కడి పేదవారికి దానం చేయాలనేది ఒక షరతు! ఇప్పుడూ భాకర్ వయసు 22 ఏళ్లే... కానీ గతంతో పోలిస్తే ఎంతో పరిపక్వతతో వ్యవహరించిన ఆమె విజయానికి బాటలు వేసుకుంది. పతకం కోసం పోటీ పడిన సమయంలో జనంలో కూర్చొని ఉన్న రాణాను చూస్తూ ధైర్యం తెచ్చుకున్నానని, తమ శ్రమ ఫలితాన్నందించిందన్న మనూ... రాణాకు తాను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పడం విశేషం.శాపం తొలగిపోయిందిఇక రాణా స్పందిస్తూ.. ‘‘నా మనసుకు ఇప్పుడు ఉపశమనంగా ఉంది. టోక్యో నుంచి కొనసాగుతున్న శాపం తొలగినట్లనిపించింది. నాటి ఓటమి నుంచి పూర్తిగా కోలుకున్నామని చెప్పలేను. అయితే, మనూ మెడల్ సాధించడం మాకు నిజంగా బిగ్ రిలీఫ్. ప్రతి విషయంలోనూ అతిగా స్పందించడం నాకూ అలవాటే. అయితే, ఆమె మరోసారి నన్ను సంప్రదించినపుడు తనకు నో చెప్పలేకపోయాను. ఇద్దరం మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలుపెట్టాం. తను ఇప్పుడు పరిణతి సాధించిన అథ్లెట్. తన విజయానికి ప్రధాన కారణం ఇదే’’ అని ట్రిబ్యూన్‌తో పేర్కొన్నాడు.-సాక్షి, క్రీడా విభాగం -
ఆట నుంచి ఓటు దాకా...
బ్యాట్ పట్టినవారు, బాక్సింగ్ చేసిన వారు, ఈత కొట్టిన వారు, షూటింగ్ చేసిన వారు.... ఇలా ఆటగాళ్లెందరో ఓటు వేటగాళ్లుగా మారారు. ఆట మైదానంలో చూపిన నేర్పునే ఓటు మైదానంలోనూ చూపిస్తామంటూ ముందుకొచ్చారు. సినీ స్టార్ల తరువాత అంతటి క్రేజున్న ఆటగాళ్లు ఈ సారి కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఫుట్ బాల్ కింగ్ బైచుంగ్ భూటియా తృణమూల్ కాంగ్రెస్ తరఫున గోల్ కొడతానంటున్నారు. చిరునవ్వుల క్రికెటర్ మహ్మద్ కైఫ్ కాంగ్రెస్ తరఫున ఫీల్డింగ్ చేస్తున్నారు. ఇక షూటర్ రాజ్యవర్ధన్ రాథోర్ బిజెపి తరఫున గురి తప్పనంటున్నారు. ఇప్పటి వరకూ స్టేడియం నుంచి చట్టసభకు పోటీపడ్డ ఆటగాళ్లెవరో చూద్దాం. మన్సూర్ అలీఖాన్ పటౌడీ - మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి రంగంలోకి దిగిన ఈ స్టైలిష్ నవాబు ఎన్నికల్లో మాత్రం గెలవలేకపోయారు. అంతకు ముందు ఆయన 1971 లో హర్యానా నుంచి పోరాడారు. కానీ గెలవలేకపోయారు. దేశానికి క్రికెట్ పిచ్చి అంటని రోజుల్లో ఆయన పోరాడి ఓడారు. చేతన్ చౌహాన్ - ఇండియన్ క్రికెట్ లో అద్భుతమైన ఓపెనర్లలో ఒకరుగా పేరొందిన చేతన్ రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బిజెపి నేతగా నిలిచారు.ఆయన అమ్రోహా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. అస్లాం షేర్ ఖాన్ - ఈ హాకీ షేర్ మధ్య ప్రదేశ్ లోని సాగర్ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయనది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి, మన హాకీ టీమ్ పరిస్థితి ఒకటేలా ఉంది. జ్యోతిర్మయ్ సిక్దర్ - ఈ స్విమ్మింగ్ ఛాంపియన్ సీపీఎం తరఫున కృష్ణనగర్ (పశ్చిమ బెంగాల్) నుంచి 2004 లో గెలిచింది. 2009 లో మాత్రం ఆమెకన్నా గజ ఈతగత్తె అయిన మమతా బెనర్జీ వేగానికి తలవంచక తప్పలేదు. జస్పాల్ రాణా - ఈ ఏస్ షూటర్ 2009 లో తెహ్రీ గఢ్ వాల్ (ఉత్తరాఖండ్) నుంచి బిజెపి తరఫున పోటీ చేశారు. కానీ గురి తప్పింది. ఆ తరువాత 2012 లో ఆయన బిజెపి వదిలి కాంగ్రెస్ లో చేరారు. ఈ సారి అంచనా తప్పింది. కీర్తి ఆజాద్ - బ్యాట్ తోనూ, నోటి తోనూ సమానంగా ఆడగల కీర్తి ఆజాద్ తండ్రి భగవత్ ఝా ఆజాద్ ఒకప్పటి బీహార్ ముఖ్యమంత్రి. తండ్రి సహా కాంగ్రెస్ నుంచి బిజెపి టీమ్ లో చేరాడు. దర్భంగా ఎంపీ అయ్యాడు. ఈ సారి మళ్లీ రెండో ఇన్నింగ్స్ ఆడతానంటున్నాడు. నవజ్యోత్ సింగ్ సిద్ధు - అద్భుతమైన వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి ఉన్న సిద్ధు రెండుసార్లు అమృతసర్ ఎంపీగా గెలిచారు. మోడీ వీరాభిమాని అయినా 2014 బిజెపీ టీమ్ లో ఈయనకు చోటు దక్కలేదు. మహ్మద్ అజారుద్దీన్ - క్రికెట్ లో ఈయన బ్యాట్ మాత్రమే మాట్లాడింది. ఎంపీగా నోరు మాట్లాడుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆయన అయిదేళ్లలో రెండే రెండు సార్లు నోరు విప్పి మాట్లాడారు. అయిదంటే అయిదు ప్రశ్నలు వేశారు. ఈ సారి రాజస్తాన్ నుంచి లక్ ట్రై చేసుకుంటున్నారు. మనోహర్ ఐచ్ - నాలుగున్నర అడుగుల ఐచ్ ఒకప్పటి మిస్టర్ యూనివర్స్. ఎనభై ఏళ్లు వచ్చినా కండల వీరుడిగానే నిలిచాడు. ఈయన బిజెపి తరఫున బెంగాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ మధ్యే ఐచ్ చనిపోయారు.