
నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పారిస్‌లో పాల్గొన్న భారత ఒలింపిక్ బృందాన్ని బుధవారం అభినందించారు. రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండప్‌లో భారత బృందంతో భేటీ అయిన ముర్ము... దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. పతకాలు తెచ్చిన క్రీడాకారులతో పాటు పతకాల కోసం పారిస్‌లో శ్రమించిన అథ్లెట్లను ఆమె ప్రశంసించారు.
పలువురు అథ్లెట్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముచ్చటించిన ఫొటోలు, బృందంతో దిగిన ఫొటోల్ని రాష్ట్రపతి భవన్ అధికారిక ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. మరోవైపు ఈరోజు ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత క్రీడాకారులకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆహా్వనం అందింది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులు కూడా ఆ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment