Paris Olympics 2024: వినేశ్‌ ఫోగట్‌ అనర్హత.. ప్రముఖుల స్పందన | Paris Olympics 2024: Social Media And Famous Personalities Reactions On Vinesh Phogat Disqualification Row | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: వినేశ్‌ ఫోగట్‌ అనర్హత.. ప్రముఖుల స్పందన

Published Wed, Aug 7 2024 5:01 PM | Last Updated on Thu, Aug 8 2024 7:45 AM

Paris Olympics 2024: Vinesh Phogat Disqualification Row, Social Media And Famous Personalities Response

పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ పోటీల్లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. సంచలన విజయాలతో ఫైనల్‌ వరకు చేరిన వినేశ్‌.. తుది సమరానికి ముందు జరిపిన బరువు పరీక్షలో విఫలమైంది. నిర్దిష్ట బరువు కంటే 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడింది. దీంతో పతకం ఖాయమనుకున్న భారతీయుల ఆశలు అడియాసలయ్యాయి. అనర్హత కారణంగా వినేశ్‌ పతకం లేకుండానే విశ్వక్రీడల సంగ్రామం నుంచి నిష్క్రమించింది.

వినేశ్‌ అనర్హత నేపథ్యంలో దేశ ప్రధాన సహా చాలామంది ప్రముఖులు స్పందించారు. ఒలింపిక్స్‌లో వినేశ్‌ ప్రయాణాన్ని సోషల్‌మీడియా కీర్తిస్తుంది. వినేశ్‌ విజయాలను ఓర్వలేక కుట్ర చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. వినేశ్‌ పతకం గెలవలేకపోయినా అందరి హృదయాలను గెలిచిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంటే వేటు వేస్తారా అని ఆశ్చర్యం​ వ్యక్తం చేస్తున్నారు. వినేశ్‌ పతక కలలు కల్లలు కావడంతో యావత్‌ భారతావణి బాధలో మునిగిపోయింది.

ఆసుపత్రిలో చేరిన వినేశ్‌
ఫైనల్‌కు ముందు అధిక బరువు ఉన్నానని గ్రహించిన వినేశ్‌.. బరువు తగ్గేందుకు శతవిధాల ప్రయత్నించి. కనీసం నీళ్లు కూడా తాగలేదు. రాత్రంగా నిద్రపోకుండా పరిగెత్తుతూ, కసరత్తులు చేస్తూ గడిపింది. అయినా బరువు పరీక్ష సమయానికి ఆమె 100 గ్రాములు అధికంగా ఉండింది. తీవ్రమైన వర్కౌట్లు చేయడం కారణంగా వినేశ్‌ అస్వస్థతకు గురైంది. ఒలింపిక్‌ విలేజ్‌లో ఉన్న భారత అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వినేశ్‌ డీ హైడ్రేషన్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు.

వినేశ్‌ అనర్హతపై ప్రముఖుల స్పందన
వినేశ్‌.. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్‌. భారత్‌కు గర్వకారణం. ప్రతీ ఒక్క భారతీయుడికి మీరు స్పూర్తి.  ఒలింపిక్స్‌లో మీ అనర్హత మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. మీకు కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సవాళ్లను ఎదురొడ్డి పోరాడే స్వభావం మీది. మళ్లీ గెలుపు దిశగా ముందుకు సాగాలి‘ అంటూ మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

వినేశ్‌ స్వర్ణంతో తిరిగి వస్తుందని దేశమంతా ఆశించింది. కేవలం వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉంటే వేటు వేస్తారా. దేశ ప్రజలారా.. మీరేమీ నిరాశ చెందవద్దు. ఏదో ఒకరోజు వినేశ్‌ కచ్చితంగా దేశానికి పతకం తెస్తుంది. వచ్చే ఒలింపిక్స్‌ కోసం నేను ఆమెను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తాను- మహవీర్‌ ఫొగట్‌, వినేశ్‌ ఫోగట్‌ బాబాయ్‌

వినేశ్‌ సామర్థ్యం, సంకల్పం, ధైర్యం చాలా గొప్పవి. ఇప్పటి వరకు ఆమె సాధించిన విజయాలు ఆకట్టుకున్నాయి. వినేశ్‌ పతకం సాధించలేకపోయినా మా హృదయాలను గెలుచుకుంది.-శశి థరూర్‌, కాంగ్రెస్‌ ఎంపీ

దేశం మొత్తానికి తీరని లోటు. ఈ విషయాన్ని రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ లోతుగా పరిశీలించి.. అవసరమైన చర్యలు తీసుకుంటుంది- బీజేపీ ఎంపీ కరణ్‌ భూషణ్‌ సింగ్‌, వివాదాస్పద బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ తనయుడు

వినేశ్‌ విషయంలో కుట్ర జరిగింది. ఆమెకు కావాల్సినంత సమయం ఇవ్వలేదు.-ఒలింపిక్‌ పతక విజేత విజేందర్‌ సింగ్‌

భారత్‌ ఒలింపిక్స్‌ను బాయ్‌కాట్‌ చేయాలి- ఆమ్‌ ఆద్మీ పార్టీ

వినేశ్‌కు మద్దతుగా ప్రముఖ కార్టూనిస్ట్‌ల కార్టూన్‌లు..

 సతీశ్‌ ఆచార్య

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement