న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–ఆగస్టులలో బర్మింగ్‌హమ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను ఎంపిక చేసేందుకు 16 మంది క్రీడాకారులతో కూడిన ప్రాథమిక జాబితాను ప్రకటించారు. ఈనెల 23 నుంచి 30 వరకు బెంగళూరులో జరిగే శిక్షణ శిబిరం తర్వాత తుది జట్లను ఎంపిక చేస్తారు. ప్రాబబుల్స్‌లో ప్రస్తుత జాతీయ మహిళల సింగిల్స్ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ... తెలంగాణకే చెందిన యువతార సూరావజ్జుల స్నేహిత్‌లకు చోటు లభించింది. ఇప్పటివరకు ఐదు కామన్వెల్త్ గేమ్స్‌లో కలిపి భారత టీటీ క్రీడాకారులు మొత్తం ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, పది కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment