న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు సౌమ్యజిత్ ఘోష్, మానికా బాత్రాలు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. హాంకాంగ్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ ఇద్దరు తమ గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచారు. కేవలం భారత ఆటగాళ్లు మాత్రమే బరిలోకి దిగిన ఈ టోర్నీలో ప్రతి గ్రూప్‌లో నలుగురు చొప్పున మ్యాచ్‌లు ఆడారు.