Soumyajit Ghosh
-
‘ఆమె బ్లాక్మెయిల్ చేస్తోంది’
బరాసత్ : తాను ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ సౌమ్యజిత్ ఘోష్ పేర్కొన్నాడు. తనను కావాలనే సదరు యువతి బ్లాక్మెయిల్ చేస్తూ రేప్ ఆరోపణలకు దిగినట్లు ఘోష్ తెలిపాడు. తనపై ఘోష్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ పద్దెనిమేదేళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'గత మూడేళ్లుగా ఘోష్ నేను రిలేషన్లో ఉన్నాము. ఆ సమయంలో అతడు నాపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ, ఆ తర్వాత నిరాకరించాడు' అంటూ బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీనిపై స్పందించిన ఘోష్..‘ నన్ను ఆ యువతి ఏడాది కాలంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ క్రమంలోనే నా నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేసింది. ఆమెకు రూ. లక్షకుపైగా ఇచ్చిన బిల్లు నా దగ్గర ఉంది. కోల్‌కతాలోని ఒక ఆస్పత్రిలో ఆ యువతి బంధువులకు ట్రీట్మెంట్ జరిగితే దానికి నేనే డబ్బులు కట్టా. అంతేకానీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడలేదు’ అని తెలిపాడు. -
మూడేళ్లుగా రేప్.. చిక్కుల్లో టెన్నిస్ ప్లేయర్
సాక్షి, బరాసత్ : పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత సౌమ్యజిత్ ఘోష్ చిక్కుల్లో పడ్డాడు. తనపై ఘోష్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ పద్దెనిమేదేళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 'గత మూడేళ్లుగా ఘోష్ నేను రిలేషన్లో ఉన్నాము. ఆ సమయంలో అతడు నాపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ, ఆ తర్వాత నిరాకరించాడు' అంటూ బాధితురాలు పోలీసులకు తెలిపింది. అదనపు సమాచారం మేరకు ఘోష్ సదరు యువతిని సోషల్ మీడియా ద్వారా 2014లో కలుసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెతో సంబంధాలు కొనసాగించాడు. తరుచుగా కోల్‌కతాలోని ఘోష్ ప్లాట్‌లో, సిలిగురిలోని ఫ్లాట్‌లో వారిద్దరు కలుసుకునేవారు. ఓసారి ఆమె గర్భవతి కూడా అయిందని, బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని సమాచారం. అంతేకాదు, వీరిద్దరు అనధికారికంగా ఓ ఆలయంలో వివాహం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ పెళ్లిని అతడు అంగీకరించడం లేదంట. బరాసత్ మహిళా పోలీస్ స్టేషన్లో ఈ మేరకు బాధితురాలు కేసు పెట్టింది. 24 ఏళ్ల ఘోష్ 2012, 2016 ఒలింపిక్స్‌లో భారత్ తరుపున పాల్గొన్నాడు. -
‘రియో’కు సౌమ్యజిత్, మోనిక
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు సౌమ్యజిత్ ఘోష్, మానికా బాత్రాలు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. హాంకాంగ్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ ఇద్దరు తమ గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచారు. కేవలం భారత ఆటగాళ్లు మాత్రమే బరిలోకి దిగిన ఈ టోర్నీలో ప్రతి గ్రూప్‌లో నలుగురు చొప్పున మ్యాచ్‌లు ఆడారు.