
బరాసత్ : తాను ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ సౌమ్యజిత్ ఘోష్ పేర్కొన్నాడు. తనను కావాలనే సదరు యువతి బ్లాక్‌మెయిల్ చేస్తూ రేప్ ఆరోపణలకు దిగినట్లు ఘోష్ తెలిపాడు.
తనపై ఘోష్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ పద్దెనిమేదేళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'గత మూడేళ్లుగా ఘోష్ నేను రిలేషన్‌లో ఉన్నాము. ఆ సమయంలో అతడు నాపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ, ఆ తర్వాత నిరాకరించాడు' అంటూ బాధితురాలు పోలీసులకు తెలిపింది.
దీనిపై స‍్పందించిన ఘోష్..‘ నన్ను ఆ యువతి ఏడాది కాలంగా బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఆ క్రమంలోనే నా నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేసింది. ఆమెకు రూ. లక్షకుపైగా ఇచ్చిన బిల్లు నా దగ్గర ఉంది. కోల్‌కతాలోని ఒక ఆస్పత్రిలో ఆ యువతి బంధువులకు ట్రీట్‌మెంట్ జరిగితే దానికి నేనే డబ్బులు కట్టా. అంతేకానీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడలేదు’ అని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment