
సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆచంట శరత్ కమల్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 41 ఏళ్ల శరత్ కమల్ క్వాలిఫయింగ్ ద్వారా పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 87వ ర్యాంకర్ శరత్ కమల్ 11–5, 11–4, 11–6తో నికోలస్ బర్గోస్ (చిలీ)పై గెలిచాడు.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత నంబర్‌వన్ మనిక బత్రా 4–11, 7–11, 2–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ యిది వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment