asia cup table tennis
-
చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. మెడల్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు
Manika Batra Won Bronze Medal At Asia Cup TT 2022: ఆసియా కప్ టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో పతకం సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 2 ప్లేయర్, జపాన్ క్రీడాకారిణి మిమా ఇటో చేతిలో ఓడిన మనిక.. శనివారమే జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 6 క్రీడాకారిణి, జపాన్‌కు చెందిన హిన హయటపై 4-2 (11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2) తేడాతో గెలుపొంది రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో మనికా, హిన ఇద్దరూ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడినప్పటికీ, విజయం మనికనే వరించింది. కాగా, మనిక బత్రా ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో అసమాన విజయాలతో సెమీస్ వరకు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. తొలి భారతీయ క్రీడాకారిణిగా..!
బ్యాంకాక్: ఏషియన్ కప్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ మనిక బత్రా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్ మనిక 6–11, 11–6, 11–5, 11–7, 8–11, 9–11, 11–9తో ప్రపంచ 23వ ర్యాంకర్ చెన్ సు యు (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. -
జపాన్ చేతిలో భారత్ ఓటమి
యోగ్యకార్తా (ఇండోనేసియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్రపంచ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో భారత పురుషుల జట్టు 1–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 11–4, 11–7, 12–10తో హరిమోటో తొమోకాజు (జపాన్)పై గెలిచి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. అయితే రెండో మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 8–11, 12–10, 5–11, 12–14తో మహరు యోషిమురా చేతిలో... మూడో మ్యాచ్‌లో హరీ్మత్ దేశాయ్ 7–11, 11–6, 6–11, 2–11తో జిన్ టకుయ చేతిలో... నాలుగో మ్యాచ్‌లో శరత్ కమల్ 7–11, 0–11, 0–11తో హరిమోటో చేతిలో ఓడిపోవడంతో టీమిండియా పరాజయం ఖాయమైంది. భారత్ ఇక 5 నుంచి 8 స్థానాల కోసం పోటీపడుతుంది. -
శరత్‌కు ఆరో స్థానం
ఆసియా కప్ టీటీ జైపూర్: ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత ఆటగాడు ఆచంట శరత్ కమల్ ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శనివారం ఐదు-ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో శరత్ 11-8, 2-11, 17-15, 7-11, 11-9, 9-11, 10-12 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్సియోక్ చేతిలో ఓడిపోయాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 32వ ర్యాంకర్ కిమ్‌పై తను పైచేయి సాధించలేకపోయాడు. గతేడాది కూడా ఈ ఆటగాడి చేతిలోనే ఓడిన శరత్ ఆరో స్థానంలోనే నిలిచాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో శరత్ తన చిరకాల ప్రత్యర్థి గావో నింగ్ (సింగపూర్)ను 11-7, 4-11, 11-8, 12-10, 11-5 తేడాతో తొలిసారి ఓడించాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో శరత్ కమల్ టాప్-20లోని ముగ్గురి ఆటగాళ్లను ఓడించి సత్తా చాటుకున్నాడు. అలాగే ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్‌లో క్వాలిఫై అయ్యే అవకాశాలను మెరుగుపరుచుకున్నాడు.