శరత్‌కు ఆరో స్థానం | sixth place for sarath | Sakshi
Sakshi News home page

శరత్‌కు ఆరో స్థానం

Published Sun, Mar 15 2015 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM

శరత్‌కు ఆరో స్థానం

శరత్‌కు ఆరో స్థానం

ఆసియా కప్ టీటీ
 
జైపూర్: ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత ఆటగాడు ఆచంట శరత్ కమల్ ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శనివారం ఐదు-ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో శరత్ 11-8, 2-11, 17-15, 7-11, 11-9, 9-11, 10-12 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్‌సియోక్ చేతిలో ఓడిపోయాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 32వ ర్యాంకర్ కిమ్‌పై తను పైచేయి సాధించలేకపోయాడు.

గతేడాది కూడా ఈ ఆటగాడి చేతిలోనే ఓడిన శరత్ ఆరో స్థానంలోనే నిలిచాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో శరత్ తన చిరకాల ప్రత్యర్థి గావో నింగ్ (సింగపూర్)ను 11-7, 4-11, 11-8, 12-10, 11-5 తేడాతో తొలిసారి ఓడించాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో  శరత్ కమల్ టాప్-20లోని ముగ్గురి ఆటగాళ్లను ఓడించి సత్తా చాటుకున్నాడు. అలాగే ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్‌లో క్వాలిఫై అయ్యే అవకాశాలను మెరుగుపరుచుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement