![Indian Mens Team Win Bronze in Asian Table Tennis Championship - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/2/Untitled-1.jpg.webp?itok=0hWmlfT9)
దోహా: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0–3తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. టోర్నీలో సెమీస్ చేరిన జట్లకు కనీసం కాంస్య పతకం దక్కుతుంది. తొలి మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 12–10, 8–11, 5–11తో 12వ ర్యాంకర్ వూజిన్ జాంగ్ చేతిలో ఓడాడు.
రెండో మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 11–7, 13–15, 11–8, 6–11, 9–11తో లీ సాంగసూ చేతిలో పోరాడి ఓడాడు. ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 4–11, 11–9, 11–8, 6–11, 11–13తో చో సీంగ్‌మిన్ చేతిలో ఓటమి చవిచూశాడు. మరోవైపు మహిళల టీమ్ విభాగంలో 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–1తో థాయ్‌లాండ్‌పై నెగ్గి ఐదో స్థానాన్ని దక్కించుకుంది.
చదవండి: Poonam Raut: పూనమ్ క్రీడా స్ఫూర్తికి ఆసీస్ క్రికెటర్ ఫిదా.. ‘నేనైతే అస్సలు అలా చేసేదాన్ని కాదు’
Comments
Please login to add a commentAdd a comment