
కోల్‌కతా: భారత టీనేజ్ సంచలనం అనాహత్ సింగ్ హెచ్‌సీఎల్ స్క్వాష్ టూర్ పీఎస్‌ఏలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అనాహత్ సింగ్ 11–3, 11–4, 11–4తో ఫెరెష్త్ ఎహెతెదరి (ఇరాన్)పై అలవోకగా నెగ్గింది. ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన అనాహత్... శనివారం జరగనున్న తుదిపోరులో జేమ్యా అరిబాడో (ఫిలిప్పీన్స్)తో అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు సూరజ్ చంద్ గాయం కారణంగా తప్పుకున్నాడు.