
Aakash Kumar Won Bronze Medal World Boxing Championship.. ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. బెల్‌గ్రేడ్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత బాక్సర్ ఆకాశ్ కుమార్ (54 కేజీలు) సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఆకాశ్ 5–0తో యోల్ ఫినోల్ రివాస్ (వెనిజులా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన నరేందర్ (ప్లస్ 92 కేజీలు), శివ థాపా (63.5 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు.